ముగిసిన క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలు
మహారాణి ఎలిజబెత్ II అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ముగిసింది.
ఈ అంతిమయాత్రకు సుమారు 2000 మంది హాజరయ్యారు. వీరిలో ప్రపంచ నాయకులు, రాజ కుటుంబ సభ్యులు, యూకే మాజీ ప్రధాన మంత్రులు, ప్రస్తుత ప్రధాన మంత్రి, ఇతర నాయకులు, ప్రముఖులు ఉన్నారు.
సెయింట్ జార్జి చర్చిలోని చాపెల్ రాయల్ వాల్ట్‌లోకి రాణి శవపేటికను దించారు.
