తుర్కియే భూకంపం: శిథిలాల కిందే ఇంకా ఎంతో మంది ప్రజలు.. సన్నగిల్లుతున్న ఆశలు

వీడియో క్యాప్షన్, తుర్కియే భూకంప శిధిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి విషయంలో సన్నగిల్లుతున్న ఆశలు

గతవారం సంభవించిన భారీ భూకంపం – దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియా ప్రాంతాలలో విధ్వంసం సృష్టించింది.

నేలకూలిన భవన శిథిలాల్లోంచి ఇప్పటికీ కొందరిని బయటకు తీస్తున్నట్టు సహాయక బృందాలు చెబుతున్నాయి.

భూకంప మృతుల సంఖ్య ఇప్పటి వరకూ 37 వేలు దాటింది. శిథిలాల నుంచి ప్రాణాలతో బయట పడటం అరుదైన సంఘటనగా మారిపోయింది.

నిర్వాసితులైన ప్రజలు గడ్డ కట్టించే చలిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకని దుస్థితి.

దక్షిణ తుర్కియేలోని భూకంప కేంద్రానికి సమీప ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి లీస్ డూసెట్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)