చేపల వలలతో ప్రమాదంలో సముద్ర జీవులు
సముద్రాల్లో ఉండే జీవజాలానికి ప్లాస్టిక్ వ్యర్థాలు చేస్తున్న హాని గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇందులో చేపల వలలు కూడా ఉంటాయి.
వీటిని రీసైక్లింగ్ చెయ్యడం చాలా కష్టం. ట్రాలర్ల ద్వారా చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలు చాలా గట్టిగా ఉంటాయి.
ఇవన్నీ సముద్రంలో కలిసి తీర ప్రాంతాలకు కొట్టుకు వస్తున్నాయి.
బ్రిటన్‌లో ప్రారంభించిన ఓ వినూత్న కార్యక్రమంతో తొలిసారిగా వీటిని కూడా రీ సైకిల్ చేయొచ్చని చెబుతున్నారు.
బీబీసీ ప్రతినిధి జోనా ఫిషర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)