Self Driving Cars: బిజిగా ఉన్న రోడ్డుపై సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణం ఎలా ఉంటుందంటే..

వీడియో క్యాప్షన్, బిజిగా ఉన్న రోడ్డుపై సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణం ఎలా ఉంటుందంటే..

భవిష్యత్ గతిని మార్చగల ఓ పైలట్ ప్రాజెక్ట్‌కు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం వేదికైంది.

అక్కడి వీధుల్లో పూర్తిస్థాయి డ్రైవర్ రహిత వాహనాలు, అంటే రోబో టాక్సీలు రాత్రి పూట తిరుగుతున్నాయి.

వీటిని తయారు చేస్తోన్న క్రూజ్ సంస్థ – ఈ రోబో టాక్సీలు రవాణా రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణగా చెబుతోంది.

అయితే నగర వీధుల్లో పూర్తి స్థాయి రోబో టాక్సీల ప్రవేశం తొందరపాటే కాదు, ప్రమాదకరం కూడా కావచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

బీబీసీ సిలికాన్ వ్యాలీ ప్రతినిధి జేమ్స్ క్లేటన్ అందిస్తోన్న రిపోర్ట్.

సైన్స్ కాల్పనిక చిత్రాల్లోని సన్నివేశాలు నేరుగా శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో కనిపిసున్నాయి.

డ్రైవర్ రహిత టాక్సీలను, పూర్థిస్థాయి రోబో టాక్సీలను కొందరు ఇష్టపడుతున్నారు.

కానీ సాంకేతికత ఇందుకు సిద్ధంగా ఉందా? తెల్సుకోవాలంటే ఉన్నది ఒకటే మార్గం.

ఆ కార్లలో మనం స్వయంగా కూర్చొని చూడాలి.

ప్రపంచంలోనే ఈ కార్లలో ప్రయాణించి పరిశీలించిన కొద్ది మీడియా సంస్థల్లో బీబీసీ ఒకటి.

ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇదేమీ రేస్ ట్రాకో లేదా టెస్టింగ్ ఫెసిలిటీనో కాదు. మేము శాన్‌ఫ్రాన్సిస్కో నడిబొడ్డున ఉన్నాం.

కారులో అసలు డ్రైవర్ లేరు. ఇది అద్భుతంగా, కలవరంగా, కాస్త అధివాస్తవికంగా, అన్నీ కలగలిసిన భావోద్వేగం కలుగుతోంది.

‘‘మా క్రూ వాహనాల్లో లైడార్ అని పిలిచే 3D స్కానింగ్, రాడార్, కేమెరాలు ఉంటాయి. మెషీన్ లెర్నింగ్ ద్వారా వాటన్నిటినీ కలిపి ఆపరేట్ చేస్తాం. అది మన చుట్టూ ఉన్న వాటి గురించి మెరుగైన అవగాహన కలిగేలా చేస్తుంది'' అని క్రూయిజ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్స్) ఒలివర్ కేమెరాన్ అన్నారు.

కానీ ప్రతిసారీ ఒకలానే అనిపించదు.

ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మా లేన్‌లోనే బస్ ఉంది. ఎడమవైపు కార్లున్నాయి. మరి ఇదేం చేస్తోంది? పక్కకు వెళ్తోంది కానీ అటువైపుగా బస్ వస్తోంది. ఇప్పడీ కారుకు ఏం చేయాలో తెలీయట్లేదు. మా వెనుక కారుంది. ఇది సరిగా డ్రైవ్ చేయట్లేదు. నేను దీనిని ఇష్టపడేందుకు సిద్ధంగానే ఉన్నాను కానీ కొంత భయంగా కూడా ఉంది.

ఈ ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో క్రూయిజ్ ఇప్పటికే చాలా ప్రమాదాలను ఎదుర్కొంది. వాటిలో చాలా వరకు చిన్న ప్రమాదాలే. అయినా కూడా జూన్‌లో జరిగిన ప్రమాదంతో దీనిలోని సాఫ్ట్‌వేర్‌ను రీకాల్ చేశారు. నగర వీధుల్లో డ్రైవర్ లేకుండా మనుషులు ఇందులో ప్రయాణించడం తొందరపాటే అంటున్నారు.

‘‘ఈ వాహనాలు ఇంకా పరీక్షల స్థాయిలోనే ఉన్నాయి. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి సమస్యలూ ఉండవని, రోడ్లపై ఎలాంటి ప్రమాదాలకూ దారితీయవని వీటి తయారీదారులు ప్రజలకు పారదర్శకంగా అధారాలను చూపించాలి.’’ అని సెంటర్ ఫర్ ఆటో సేఫ్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ బ్రూక్స్ అన్నారు.

''ఈ ప్రోడక్ట్‌ను ప్రవేశపెట్టి ఆరు నెలలు గడుస్తున్నాయి. బ్రాండ్ న్యూ. గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్. ఈ దశలో కొన్ని ప్రాథమిక సమస్యలు తలెత్తుతాయి. భద్రత విషయంలో మాకున్న రికార్డుకి గర్వపడుతున్నాం. మా రెగ్యులేటర్స్‌కు తరచుగా రిపోర్టులు అందిస్తున్నాం. క్రూయిజ్‌లో భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది'' అని ఒలివర్ కేమెరాన్ అన్నారు.

భద్రతా అంశాల్లో కొన్ని ఆందోళనలున్నా - క్రూయిజ్ మరింత వేగంగా విస్తరించాలనే ఆశిస్తోంది. వాళ్ల దూకుడు ఇంకా పెరిగితే ఇటువంటి కార్లలో ప్రయాణాలు త్వరలోనే మనకు సాధారణమైపోతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)