భారత్ జోడో యాత్రలో ‘సోనియా గాంధీ అర కిలోమీటరు నడిచి వెళ్లారు’: బసవరాజు బొమ్మై

‘భారత్ జోడో’ యాత్ర వల్ల తమకు ఎటువంటి నష్టం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ కర్నాటకలో ర్యాలీలు చేపడుతోందనే విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    అంతవరకు సెలవు. నమస్తే.

  2. యూఎన్: చైనా వ్యతిరేక తీర్మానంలో ఓటు వేయకుండా భారత్ గైర్హాజరు

    చైనాలోని షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల మీద ఐక్యరాజ్య సమితి హ్యుమన్ రైట్స్ కౌన్సిల్‌లో చర్చ చేపట్టేందుకు ఉద్దేశించిన తీర్మానం తిరస్కరణకు గురైంది.

    చైనా, క్యూబా, నేపాల్, పాకిస్తాన్ వంటి దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, జపాన్, అమెరికా వంటి దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

    అయితే భారత్ మాత్రం ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

    షిన్‌‌జియాంగ్‌లోని వీగర్ అటానమస్ రీజియన్‌లో వీగర్ ముస్లింల మీద జాతిహననానికి చైనా పాల్పడుతోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. వ్లాదిమిర్ పుతిన్ 70వ పుట్టిన రోజు: రష్యా అధ్యక్షుడి జీవితాన్ని మలిచిన ఏడు కీలక ఘట్టాలు

  4. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక: ఈ పిల్లల దగ్గు మందులతో జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం.. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి..

  5. ‘సోనియా గాంధీ అర కిలోమీటరు నడిచి వెళ్లారు’... భారత్ జోడో యాత్రపై బసవరాజు బొమ్మై

    కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై

    ఫొటో సోర్స్, ANI

    ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర కర్నాటకలో సాగుతోంది.

    అయితే ‘భారత్ జోడో’ యాత్ర వల్ల తమకు ఎటువంటి నష్టం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు.

    నేడు ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి కాసేపు నడిచారు.

    దీనిపై బొమ్మై స్పందిస్తూ ‘సాధారణంగా అన్ని పార్టీల నేతలు, తమ సొంత పార్టీ కోసం పని చేస్తారు. కానీ ఆమె (సోనియా గాంధీ) అర కిలోమీటరు నడిచి వెళ్లి పోయారు’ అని అన్నారు.

    కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ కర్నాటకలో ర్యాలీలు చేపడుతోందనే విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

    ‘మేం గతంలో ఆరు ర్యాలీలు చేపట్టాలని అనుకున్నాం. దసరా తరువాత వాటిని చేపట్టాలని నిర్ణయించుకున్నాం’ అని బసవరాజు బొమ్మై అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఫ్రెంచ్ రచయితకు నోబెల్ సాహిత్య బహుమతి

    ఫ్రెంచ్ రచయిత అన్నే ఎనాక్స్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫ్రెంచ్ రచయిత అన్నే ఎనాక్స్‌కు నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది.

    1940లో పుట్టిన అన్నే, నార్మండీలోని చిన్న పట్టణంలో పెరిగారు. అక్కడ ఆమె తల్లిదండ్రులు చిన్న గ్రాసరీ స్టోర్, కెఫే నడిపేవారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. నర్సరీలోని పసి పిల్లలపై మాజీ పోలీసు కాల్పులు, కత్తి పోట్లు.. 37 మంది మృతి

  8. గుజరాత్: గేదెల గుంపు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్

    గేదెల గుంపు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, గేదెల గుంపు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్

    గేదెల గుంపును ఢీకొట్టడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ముందు భాగం దెబ్బతిన్నది.

    ఈ రైలు ముంబయి, గాంధీనగర్ మధ్య తిరుగుతుంది.

    ఉదయం 11.15 గంటలప్పుడు వత్వా, మణినగర్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలపైకి గేదెలు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పశ్చిమ రైల్వే ప్రతినిధి జేకే జయంత్ చెప్పారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

  9. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి ఈ యువ దంపతులు పాదయాత్ర చేస్తున్నారు, ఎందుకు?

  10. బ్రేకింగ్ న్యూస్, థాయ్‌లాండ్: డే కేర్ సెంటర్‌లో మాజీ పోలీస్ అధికారి కాల్పులు, కనీసం 31మంది మృతి

    థాయ్‌లాండ్‌లో ఒక ప్రీస్కూల్ డే కేర్ సెంటర్‌లో ఓ మాజీ పోలీస్ అధికారి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో కనీసం 31మంది మరణించారని ఆ దేశ పోలీసులు వెల్లడించారు.

    మరణించిన వారిలో కనీసం 23 మంది చిన్నారులు ఉన్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.

    థాయ్ లాండ్ డే కేర్ లో కాల్పులు
    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    థాయ్‌లాండ్‌లోని నాంగ్ బువా లాంఫు నగరంలో జరిగిన ఈ ఘటన తర్వాత నిందితుడు తప్పించుకుని పారిపోయాడని పోలీసులు తెలిపారు.

    అయితే, గన్‌మాన్ తన భార్యా పిల్లలను కాల్చి చంపి, తాను కూడా కాల్చుకుని చనిపోయాడని థాయ్‌లాండ్ మీడియా తెలిపింది.

    ఈ ఘటన బాధితుల్లో చిన్నారులతోపాటు పెద్దవాళ్లు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

    పిల్లలు, పెద్దవాళ్ల మీద నిందితుడు కాల్పులు జరపడమే కాకుండా, వారిపై దాడికి కూడా పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.

    దాడికి వెనక కారణాలు ఇంకా తెలియరాలేదని వారు వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తమ ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. 34 ఏళ్ల పాన్య కమ్రాబ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని వారు వెల్లడించారు. కాల్పులు జరిపిన తర్వాత కమ్రాబ్ తన తెలుపు రంగు పికప్ ట్రక్ లో సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని వెల్లడించారు.

  11. శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  12. అమెరికా: కిడ్నాప్‌కు గురైన పంజాబీ కుటుంబం మృతదేహాలను గుర్తించిన పోలీసులు

    పంజాబీ కుటుంబం

    ఫొటో సోర్స్, MERCEDSHERIFF

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన పంజాబీ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసులు బుధవారం వెల్లడించారు.

    అదృశ్యమైన ఈ కుటుంబం కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు.

    27 ఏళ్ల జస్లీన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్, 8 నెలల పాప చనిపోయిన వారిలో ఉన్నారు.

    ఈ కేసులో నిందితులకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, అయితే దానిని వెల్లడించలేమని పోలీసులు తెలిపారు.

    ఈ కుటుంబం పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నగరానికి చెందినది ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    గత సోమవారం మెర్సిడ్‌లోని ఒక షాప్ నుంచి కుటుంబాన్ని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి కుస్తీ తొలగింపు

    కుస్తీ

    ఫొటో సోర్స్, Getty Images

    2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో కుస్తీ (రెజ్లింగ్‌) పోటీ ఉండబోదని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ప్రకటించింది.

    షూటింగ్‌ను కూడా కామన్‌వెల్త్ క్రీడల నుంచి తొలగిస్తారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తొలగిస్తున్న క్రీడల తుది జాబితాలో కుస్తీ, జూడోలను చేర్చి, షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు.

    కోస్టల్ రోయింగ్, సైక్లింగ్ (బీఎంఎక్స్), గోల్ఫ్‌లను ఈసారి జరిగే క్రీడల్లో చేరుస్తున్నారు.

    ఈ వార్తపై భారతీయ రెజ్లింగ్ క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియాలో నిరాశను వ్యక్తం చేశారు.

    ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే బాగుంటుందని రెజ్లర్ వినేష్ ఫోగాట్ వ్యాఖ్యానించినట్లు హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.

    గత నాలుగు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లింగ్ క్రీడాకారులు 26 స్వర్ణాలు, 15 రజతాలు, 15 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

  14. మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి

    బుధవారం మధ్యాహ్నం మెక్సికో నైరుతి ప్రాంతంలోని సాన్ మిగ్యుల్ టోటోలాపెన్ నగరంలో జరిగిన అగంతకుల కాల్పుల్లో మేయర్ కాన్రెడో మిగ్యుల్ అల్మెయిడాతో సహా మొత్తం 18 మంది చనిపోయారు.

    మేయర్ అల్మేడా తండ్రి, మాజీ మేయర్ క్వాన్ మెండోజా అకోస్టా కూడా కాల్పుల్లో మరణించారు.

    మెక్సికోలో అగంతకుల కాల్పులు

    ఫొటో సోర్స్, REX/Shutterstock

    స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరంలోని టౌన్‌హాల్‌లోకి ప్రవేశించారు.

    ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మేయర్‌తో సహా కొందరు కౌన్సిల్ సభ్యులు, కొందరు పోలీసులు కూడా మరణించారు.

    మేయర్ కాన్రెడో మిగ్యుల్ అల్మెయిడా

    ఫొటో సోర్స్, TOTOLAPAN GOVERNMENT

    ఫొటో క్యాప్షన్, మేయర్ కాన్రెడో మిగ్యుల్ అల్మెయిడా

    కొన్ని నివేదికల ప్రకారం, టౌన్ హాల్‌పై దాడికి ముందు మేయర్ తండ్రిని అతని ఇంట్లో దుండగులు చంపారు.

    సంఘటనకు ముందు, భద్రతా బలగాలు లోపలికి ప్రవేశించకుండా నగరాన్ని కలిపే రహదారులపై పెద్ద ఎత్తున వాహనాలను కూడా దుండగులు నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది.

  15. భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

    రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, @INCIndia

    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సోనియా గాంధీ

    కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

    కర్ణాటకలోని మాండ్యా జిల్లా నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇది 29వ రోజు.

    గత 28 రోజులుగా, ఇండియా జోడో యాత్ర కేరళలోని వివిధ జిల్లాల గుండా సాగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆరోగ్య కారణాల దృష్ట్యా సోనియా గాంధీ కొద్దిసేపు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటారు. తర్వాత ఆమె దిల్లీకి వెళ్లిపోతారు.

    కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్రవారం మైసూర్ చేరుకుని భారత్ జోడో యాత్రలో చేరనున్నారు.

    ఈ యాత్ర కర్ణాటకలో 21 రోజుల పాటు కొనసాగనుంది. 511 కి.మీ దూరాన్ని కవర్ చేస్తారు.

  16. గుడ్ మార్నింగ్ బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    ముఖ్యాంశాలు:

    • నేటి భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ కూడా పాల్గొంటున్నారు.
    • మెక్సికోలోని ఓ నగరంలో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో మేయర్ సహా 18మంది మరణించారు.
    • ఆరెస్సెస్‌కు మహిళను చీఫ్‌గా ప్రకటిస్తే తాను ప్రస్తుత ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఫ్యాన్‌గా మారతానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.
    • 2026లో ఆస్ట్రేలియాలో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ ఉండబోదని కామన్ వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది.