ఏంజెలీనా జోలీ: ‘బ్రాడ్ పిట్ నన్ను, నా పిల్లలను కొట్టాడు... తిట్టాడు’

మాజీ భర్త బ్రాడ్ పిట్, ప్రైవేటు విమానంలో తన మీద దాడి చేశారని ఏంజెలీనా జోలీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు. తాగి ఉన్న బ్రాడ్ పిట్ తన తల పట్టుకుని ఊపడంతో పాటు పిల్లల మీద కూడా దాడి చేశారని జోలీ ఆరోపించారు.

లైవ్ కవరేజీ

  1. బౌలింగ్ యాక్షన్‌నే బుమ్రా శరీరానికి ప్రాణాంతకంగా మారిందా? వరుస గాయాలకు కారణం అదేనా?

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    అంతవరకు సెలవు.

  3. హరియాణ: సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు మృతి

    హరియాణాలోని ఫరీదాబాద్‌లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు సఫాయి కార్మికులు చనిపోయారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    క్యూఆర్‌జీ ఆసుపత్రికి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న సమయంలో విడుదలైన గ్యాస్‌ను పీల్చుకోవడం వల్ల వారు చనిపోయారని ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.

    చనిపోయిన వారి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. GodFather: హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేకుండా చిరంజీవి నటన ఎలా ఉంది

  5. ‘భారత ఫార్మా కంపెనీ తయారు చేసిన మందుల వల్ల 66 మంది పిల్లలు మృతి’

    డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్

    ఫొటో సోర్స్, Twitter/Tedros Adhanom Ghebreyesus

    గాంబియా చిన్నారుల్లో కిడ్నీల సమస్యలు తలెత్తడానికి... భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన నాలుగు రకాల దగ్గు, జలుబు సిరప్‌లకు మధ్య సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

    పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో ఈ మందులు వాడటం వల్ల 66 మంది పిల్లలు కిడ్నీ సమస్యలతో చనిపోయారని భావిస్తున్నట్లు తెలిపింది. భారత్ అధికారులతో పాటు కంపెనీ ప్రతినిధులతో కలిసి దీని మీద విచారణ చేపట్టినట్లు వెల్లడించింది.

    ఈ ఏడాది జులైలో అయిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కిడ్నీల సమస్యలతో చనిపోవడం మీద విచారణ చేపట్టినట్లు గాంబియా ప్రభుత్వం వెల్లడించింది.

    ‘ఆ కలుషిత సిరప్‌లను ప్రస్తుతం గాంబియాలోనే గుర్తించాం. అవి ఇతర దేశాలకు కూడా వెళ్లి ఉండొచ్చు. వాటిని వెంటనే గుర్తించి మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని’ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఏంజెలీనా జోలీ: ‘బ్రాడ్ పిట్ నన్ను కొట్టాడు... తిట్టాడు’

    ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్

    ఫొటో సోర్స్, Getty Images

    మాజీ భర్త బ్రాడ్ పిట్, ప్రైవేటు విమానంలో తన మీద దాడి చేశారని ఏంజెలీనా జోలీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు.

    2016లో ఒక ట్రిప్ కోసం ప్రైవేటు ప్లేన్‌లో వెళ్తున్న సమయంలో ఆ దాడి జరిగిందని ఆమె పేర్కొన్నారు.

    తాగి ఉన్న బ్రాడ్ పిట్ తన తల పట్టుకుని ఊపడంతో పాటు పిల్లల మీద కూడా దాడి చేశారని జోలీ ఆరోపించారు.

    ‘జోలీ తల పట్టుకుని బ్రాడ్ పిట్ గట్టిగా ఊపారు. ఆ తరువాత ఆమె భుజాలు పట్టుకుని అటుఇటు ఊపారు. చివరకు బాత్‌రూంలోకి నెట్టారు’ అని పత్రాల్లో రాశారు.

    ఫ్రాన్స్ నుంచి లాస్ ఏంజలీస్‌కు వెళ్లే ప్రయాణంలో ఆ ఘటన జరిగిందని జోలీ తెలిపారు.

    ‘అడ్డు వచ్చిన పిల్లలను కూడా కొట్టడంతోపాటు తన మీద, వారి మీద బీరు, వైన్ పోశాడు. తమను దూషించాడు’ అని కూడా ఆరోపించారు జోలీ.

    అయితే అదంతా నిజం కాదని తనకు కావాల్సింది దక్కకపోవడంతో జోలీ అలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బ్రాడ్ పిట్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తి బీబీసీకి తెలిపారు.

    ఫ్రాన్స్‌లోని వైన్ యార్డ్‌కు సంబంధించి జోలీ, పిట్ మధ్య కోర్టు వివాదం నడుస్తోంది.

  7. అఫ్గానిస్తాన్: మసీదులో బాంబు పేలుడు... నలుగురు మృతి

    అఫ్గానిస్తాన్

    ఫొటో సోర్స్, ANI

    అఫ్గానిస్తాన్‌లోని ఆ దేశ హోంశాఖ కార్యాలయానికి దగ్గర్లో గల మసీదులో బాంబు పేలింది.

    ఈ ఘటనలో సుమారు నలుగురు చనిపోయారని, 25 మంది గాయపడ్డారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

    ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

  8. ఈయూ పార్లమెంటులో ఎంపీ జుట్టు ఎందుకు కత్తిరించుకున్నారు?

    ఈయూ పార్లమెంటులోని స్వీడన్ ఎంపీ అబిర్ అల్ సహ్లానీ

    ఫొటో సోర్స్, Twitter/AbirAlSahlani

    ఫొటో క్యాప్షన్, ఈయూ పార్లమెంటులోని స్వీడన్ ఎంపీ అబిర్ అల్ సహ్లానీ

    ఇరాన్‌లో జరుగుతున్న ‘హిజాబ్’ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతుగా యురోపియన్ యూనియన్ పార్లమెంటులోని స్వీడిష్ మెంబర్ తన జుట్టును కత్తిరించుకున్నారు.

    హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలను ఇరాన్ ప్రభుత్వం అణచివేస్తున్న తీరును నిరసిస్తూ మంగళవారం సాయంత్రం యురోపియన్ యూనియన్ పార్లమెంటులో చర్చ జరగింది.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ అబిర్ అల్ సహ్లానీ తన జుట్టును కత్తిరించుకున్నారు. ఈమె ఇరాన్ సంతతికి చెందిన వ్యక్తి అని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

    ‘ఇరాన్ మహిళలకు స్వేచ్ఛ లభించే వరకు వారికి మేం అండగా ఉంటాం’ అని అల్ సహ్లానీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 32 మంది మృతి

    ఉత్తరాఖండ్‌లోని లోయ

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో 32 మంది చనిపోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఈ ఘటనలో మరొక 18 మంది గాయపడ్డారు.

    సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న బస్సు నిన్న రాత్రి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.

    పౌరి గర్వాల్ జిల్లాలోని సిమ్ది గ్రామం వద్ద ఈ దుర్ఘన చోటు చేసుకుంది.

  10. ఇజ్రాయెల్: గోడలో బయటపడిన 7వ శతాబ్దం నాటి బంగారు నాణేలు

    7వ శతాబ్దం నాటి బంగారు నాణేలు

    ఫొటో సోర్స్, Israel Antiquities Authority

    ఫొటో క్యాప్షన్, 7వ శతాబ్దం నాటి బంగారు నాణేలు

    ఇజ్రాయెల్‌లో 7వ శతాబ్దం నాటి బంగారు నాణేలు బయటపడినట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు.

    ఒక గోడలో 44 బంగారు నాణేలు లభించాయని వెల్లడించారు. వాటి మొత్తం బరువు సుమారు 170 గ్రాములు.

    ఈ ప్రాంతంలో బైజాంటిన్ సామ్రాజ్యం పతనం గురించి ఆ నాణేలు కొంత సమాచారాన్ని ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    ముస్లింల దండయాత్ర సమయంలో నాటి ప్రజలు ఆ బంగారు నాణేలను దాచి పెట్టి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

    క్రీ.శ.635 ప్రాంతంలో ముస్లిం రాజుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి.

    ఈ నాణేలు కొన్ని ఫోకస్(602-610) చక్రవర్తి కాలానికి చెందినవి కాగా మరికొన్ని ఆయన తరువాత వచ్చిన హెరాక్లియస్ కాలానికి చెందినవి.

  11. భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?

  12. భార్యను మోస్తూ తిరుమల మెట్లెక్కిన భర్త... ఆ వీడియోపై ఏమంటున్నారు?

    భార్యను భుజంపై మోసుకుంటూ తిరుమల మెట్లెక్కుతున్న భర్త వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకకు చెందిన వరద సత్తిబాబు తన భార్యను ఎత్తుకుని ఇలా తిరుమల మెట్లు ఎందుకు ఎక్కారు. దీనిపై ఆయన కూతుళ్లు ఏమంటున్నారు?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  13. ‘పాకిస్తాన్‌తో మాట్లాడే ప్రసక్తే లేదు’ : అమిత్ షా

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    ఫొటో సోర్స్, @AmitShah

    పాకిస్తాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

    ‘పాకిస్తాన్‌తో చర్చలు జరపమని కొందరు చెబుతున్నారు. పాకిస్తాన్‌తో ఎందుకు మాట్లాడాలి? వారితో మేం మాట్లాడేది లేదు.

    మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. కశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం.

    కొందరు తరచూ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తున్నారు. ‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు’లోని గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్ల గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా.

    గత మూడేళ్లలో మేం కశ్మీర్‌లోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాం’ అని అమిత్ షా అన్నారు.

    ‘ఉగ్రవాదాన్ని’ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని, ఇక్కడి నుంచి ‘ఉగ్రవాదుల’ను తరిమి కొట్టి కశ్మీర్‌ను శాంతిక్షేత్రంగా మారుస్తామని ఆయన తెలిపారు.

    ‘ఉగ్రవాదం’ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, 1990 నుంచి కశ్మీర్‌లో సుమారు 42వేల మందిని అది చంపిందని అమిత్ షా చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ దసరా వేడుకల్లో మోదీ

    హిమాచల్ ప్రదేశ్ దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన కుల్లులోని ‘భగవాన్ శ్రీ రఘునాథ్’ దేవాలయాన్ని మోదీ సందర్శించారు. అక్కడి రథ యాత్రలోనూ పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మృతి.. 20 మంది గల్లంతు

  16. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్: ‘జనాభా విధానం అందరికీ ఒకేలా ఉండాలి’

    ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

    ఫొటో సోర్స్, @RSSORG

    దేశంలో జనాభా విధానాన్ని మార్చాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

    అందిరికీ సమానంగా వర్తించేలా ఆ నిబంధనలు ఉండాలని పిలుపునిచ్చారు.

    ‘మన దేశంలో సుమారు 70 కోట్ల యువ జనాభా ఉంది. చైనాలో జనాభా భారంగా మారినప్పుడు ఆ దేశం తన విధానాలు మార్చుకుంది.

    మనం కూడా నేర్చుకోవాలి. ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలదు?’ అని ఆయన ప్రశ్నించారు.

    సమాజంలో అసమానతలు తొలగనంత వరకు రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం సాధించలేమని కూడా మోహన్ భాగవత్ అన్నారు.

    ‘మనకు రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చింది కానీ సామాజిక స్వాత్రంత్యం రాలేదని అంబేడ్కర్ అన్నారు.

    గుడి, నీరు, స్మశానాలు అన్నీ అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి.

    గుర్రాన్ని వీళ్లు ఎక్కొచ్చు, వారు ఎక్క కూడదు అనే చిల్లర వ్యవహారాలకు ముగింపు పలకాలి.

    ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకోవాలి’ అని భాగవత్ పిలుపునిచ్చారు.

    దసరా సందర్భంగా నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. రొకిటాన్స్‌కీ సిండ్రోమ్: యోని లోపలి భాగాలు, గర్భాశయం లేకుండా పిల్లలు పుట్టే అవకాశముందా

  18. క్లిక్ కెమిస్ట్రీకి నోబెల్ బహుమతి

    కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతి ఈ ఏడాది ముగ్గురికి లభించింది.

    కరోలిన్ ఆర్ బెర్టొజీ, మార్టిన్ మెల్డల్, కే బారీ షార్ప్‌లెస్ ఉమ్మడిగా నోబెల్(2022)ను గెలుచుకున్నారు.

    ‘క్లిక్ కెమిస్ట్రీ’ అనే విభాగాన్ని సృష్టించి, అందులో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్లు ది రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

    బారీ షార్ప్‌లెస్‌కు ఇది రెండో నోబెల్ బహుమతి. 2001లో ఆయనకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది.

    నోబెల్ చరిత్రలో ఇప్పటి వరకు అయిదుగురు రెండు సార్లు బహుమతి గెలుచుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. బీఆర్‌ఎస్‌కు అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు

    ‘తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్), బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ పార్టీగా మారుతున్న సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నా’ అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.

    సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటును ఆహ్వానించారు. కాకపోతే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలకు కలిసి వచ్చేలా కేసీఆర్ కార్యక్రమాలు ఉండాలని సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేని చిరంజీవి సినిమా ఎలా ఉంది?