బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ మండపాలకు రక్షణ కల్పిస్తున్న ముస్లింలు.. ఎందుకంటే..

వీడియో క్యాప్షన్, గతేడాది జరిగిన దారుణాలను మళ్లీ జరగనివ్వబోమంటున్న స్థానికులు

బంగ్లాదేశ్‌లో గతేడాది దుర్గా పూజ సమయంలో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి.

నాడు నోవాఖాలిలోని చౌముహాని ప్రాంతంలో దేవాలయాలపై దాడులు, విధ్వంసం జరిగాయి.

ఈ ప్రాంతంలో ఇస్కాన్‌ సహా 6 మందిరాలు, 7 పూజా మండపాలతో పాటు, అనేక హిందువుల ఇళ్ళపైన కూడా దాడులు చేసి, నిప్పంటించారు దుండగులు.

ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

అప్పటి దాడులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏం జరుగుతుందోనన్న భయాల మధ్యే నోవాఖాలిలో జౌలుషీన్ పూజ నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక ముస్లింలు, హిందువులకు అండగా నిలుస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పూజా మండపాల దగ్గర పహారా కాస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి షాహనవాజ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)