రష్యా వర్సెస్ యుక్రెయిన్: వొలొదిమిర్ జెలియెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోను

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. యుక్రెయిన్-రష్యా యుద్ధం గురించి ఇద్దరు మాట్లాడుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    అంతవరకు సెలవు. నమస్తే!

  2. ఉత్తరాఖండ్: లోయలో పడిన బస్సు... లోపల సుమారు 50 మంది ప్రయాణికులు

    ఉత్తరాఖండ్‌లో 45 నుంచి 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    పౌరి గర్వాల్ జిల్లాలోని సిమ్ది గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.

    విషయం తెలియగానే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిని సమీక్షించడానికి స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కు చేరుకున్నారు.

    సహాయక చర్యలు చేపడుతున్నామని, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు పుష్కర్ సింగ్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఫొటోగ్రఫీతో 57 ఏళ్ల సత్యభామ ప్రత్యేక గుర్తింపు.. ఫొటోల కోసం పోలీసులూ ఆమెను పిలుస్తారు

  4. యుక్రెయిన్ అధ్యక్షునికి ఫోన్ చేసిన నరేంద్ర మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీతో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు.

    యుక్రెయిన్-రష్యా యుద్ధం గురించి ఇద్దరు మాట్లాడుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

    సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలికి చర్చలు ప్రారంభించాల్సిన ఆవశ్యకతను మోదీ చెప్పారు.

    సైన్యాన్ని ఉపయోగించడం ఏ సమస్యకు పరిష్కారం కాదని... యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం తమ వంతు సాయం చేయడానికి సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. యూఏఈలో కొత్త వీసా విధానాలు.. దుబాయ్ వెళ్లాలంటే ఎలా, ఏ వీసా తీసుకోవాలి?

  6. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆపారంటూ తన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టిన యజమాని

  7. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు కమోడ్‌లో అధికారిక పత్రాలు వేసి ఫ్లష్ చేసేవారా? కొత్త పుస్తకం వెల్లడిస్తున్న విషయాలేమిటి?

  8. బాపట్ల బీచ్‌లో విద్యార్థుల గల్లంతు, ఇద్దరు మృతి, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో విహారయాత్రకి వెళ్లిన విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.

    విజయవాడకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు సెలవులు కావడంతో బీచ్‌కి వెళ్లారు. అయితే అలల తాకిడితో 8 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

    వారిలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు ఒడ్డుకి చేరాయి. మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకి చేరారు.

    మిగిలిన నలుగురు ఆచూకీ మాత్రం తెలియాల్సింది. వారికోసం సహాయక బృందాలు రంగంలో దిగాయి. గాలింపు చర్యలు చేపట్టారు.

    మృతుల వివరాలను బాపట్ల పోలీసులు మీడియాకి వెల్లడించారు. అభి, సిద్దు అనే ఇద్దరు విజయవాడకి చెందిన విద్యార్థులుగా ప్రకటించారు.

  9. భౌతికశాస్త్రంలో క్వాంటమ్ ఫిజిక్స్ పరిశోధనలకు నోబెల్ బహుమతి ప్రకటన

    క్వాంటమ్ ఫిజిక్స్

    ఫొటో సోర్స్, Getty Images

    భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘క్వాంటమ్ మెకానిక్స్’ పరిశోధనకు ప్రకటించారు. ప్రకృతిని అతి సూక్ష్మస్థాయిలో వర్ణించే సైన్స్ క్వాంటమ్ మెకానిక్స్.

    ఈ రంగంలో పరిశోధనలు చేసిన ఫ్రాన్స్‌ భౌతికశాస్త్రవేత్త అలాన్ ఆస్పెక్ట్, అమెరికా పరిశోధకుడు జాన్ క్లాసర్, ఆస్ట్రియా శాస్త్రవేత్త ఆంటన్ జీలింగర్‌లకు ఫిజిక్స్ నోబెల్ బహుమతిని ప్రకటించారు.

    వీరి పరిశోధనల ద్వారా హ్యాక్ చేయటానికి అసాధ్యమైన అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ తయారీకి తలుపులు తెరుచుకున్నాయి.

    ఫిజిక్స్ నోబెల్ విజేతలు

    ఫొటో సోర్స్, Jonas Ekstromer/EPA-EFE/REX/Shutterstock

    నోబెల్ బహుమతి మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనా (దాదాపు 7.47 కోట్ల రూపాయలు)ను ఈ ముగ్గరు పరిశోధకులూ పంచుకుంటారు.

    పరమాణువులోని రెండు కణాలను వేరు చేసినపుడు కూడా అవి ఒకే విభాగంగా పనిచేస్తాయి. వీటిపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు విప్లవాత్మక పరిశోధనలు నిర్వహించారు.

    ఈ ముగ్గురు శాస్త్రవేత్తలూ 2010లో వోల్ఫ్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. మళ్లీ క్షీణించిన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

    ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ తెలిపింది.

    స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందం ఆయనకు చికిత్సను అందిస్తున్నట్లు వెల్లడించింది.

    నేతాజీ త్వరగా కోలుకోవాలంటూ సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

    82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రిలో చేర్చారు.

    ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు.

    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఉన్నారు ములాయం సింగ్ యాదవ్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. Electoral bonds: ఎన్నికల బాండ్ల‌తో బీజేపీకే మేలు జరిగిందా? వీటిపై ఇన్ని ప్రశ్నలు ఎందుకు?

  12. జమ్మూ కశ్మీర్ జైళ్ల డీజీ హత్య కేసులో పనిమనిషి అరెస్ట్

    జమ్మూకశ్మీర్ జైళ్ల డైరక్టర్ జనరల్ హేమంత్ లోహియా

    ఫొటో సోర్స్, JKPrisons Department

    ఫొటో క్యాప్షన్, జమ్మూకశ్మీర్ జైళ్ల డైరక్టర్ జనరల్ హేమంత్ లోహియా

    జమ్మూకశ్మీర్ జైళ్ల డైరక్టర్ జనరల్ హేమంత్ లోహియా అనుమానాస్పద మరణానికి సంబంధించి.. ఆయన వద్ద పని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    నిందితుడైన 23 ఏళ్ల యాసిర్ లోహార్ కోసం పోలీసులు రాత్రంతా గాలింపు నిర్వహించారని, రాంబాన్ జిల్లాలోని కన్హాచాక్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారని జమ్మూలో ఉన్న బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ మోహిత్ కంధారి తెలిపారు.

    నిందితుడు యాసిర్ రాంబాన్ జిల్లాలోని హల్లా దాంద్రాత్ గ్రామ నివాసి అని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    హేమంత్ లోహియా మృతదేహాన్ని సోమవారం రాత్రి జమ్మూ శివార్లలోని ఆయన స్నేహితుడి నివాసంలో కనుగొన్నారు. ఇది హత్య కేసు అని అధికారులు చెప్తున్నారు.

  13. ఇండోనేసియా: ఆటగాళ్ల ‘చేతుల్లోనే ప్రాణాలు విడిచిన’ అభిమానులు..

    అరేమా ఎఫ్‌సీ ప్లేయర్లు

    ఫొటో సోర్స్, Reuters

    ఇండోనేసియాలోని కంజూరుహా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో క్రీడాకారుల చేతుల్లోనే కొంత మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, ఈ తొక్కిసలాట మృతుల్లో 32 మంది చిన్నారులు ఉన్నారని హోమ్ టీమ్ కోచ్ జేవియర్ రోకా తెలిపారు.

    జావాలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 125 మంది ప్రాణాలను కోల్పోవడం తనను మానసికంగా కుదిపేసిందని జేవియర్ రోకా చెప్పారు.

    శనివారం జరిగిన ఈ విషాదంలో మరణించిన అతి చిన్న వయసు వారిలో మూడేళ్ళ చిన్నారి ఉన్నారు.

    మ్యాచ్ ముగిసిన వెంటనే పిచ్ ను ఆక్రమించిన అభిమానులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంపై 18 మంది అధికారులను విచారిస్తున్నారు.

    మలాంగ్ పోలీస్ చీఫ్ ను విధుల నుంచి తొలగించారు. మరో 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు.

    పోలీసులు గ్యాస్ ప్రయోగించడంతో ఊపిరి అందక 320 మందికి పైగా అభిమానులు ఈ తొక్కిసలాటలో గాయాల పాలయ్యారు.

    ఈ ఘటనలో 3 - 17 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారని మహిళా శిశు వ్యవహారాల డిప్యూటీ మంత్రి చెప్పారు.

  14. షిమ్రాన్ హెట్‌మెయిర్: ఫ్లైట్ మిస్సై టీ20 ప్రపంచకప్‌కు దూరమైన క్రికెటర్

    షిమ్రాన్ హెట్‌మెయిర్: ఫ్లైట్ మిస్సై టీ20 ప్రపంచకప్‌కు దూరమైన క్రికెటర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ ఆడే తమ జట్టులోంచి షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను తొలగిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.

    హెట్‌మెయిర్‌ను జట్టు నుంచి తొలగించడానికి కారణం అతను ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్ మిస్ కావడమే.

    వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీ శనివారం నాడే హెట్‌మెయిర్ తన జట్టుతో కలసి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. కానీ, కుటుంబ కారణాల రీత్యా తాను ఆ రోజు వెళ్లలేనని తెలిపాడని, దీంతో అతి కష్టం మీద అక్టోబర్ 3వ తేదీ సోమవారం నాడు గయానా నుంచి ఆస్ట్రేలియాకు ఒక టికెట్ బుక్ చేశామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘‘విమానంలో సీటు దొరకడం చాలా కష్టమైంది. అయినప్పటికీ అక్టోబర్ 3వ తేదీన ప్రయాణానికి ఒక సీటును న్యూయార్క్ మీదుగా బుక్ చేశాం. అంటే, దురదృష్టవశాత్తూ అతను అక్టోబర్ 5వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ను మిస్సవుతాడు. అయితే, న్యూయార్క్ వెళ్లే విమానాన్ని పట్టుకునేందుకు సకాలంలో విమానాశ్రయం చేరుకోలేనని హెట్‌మెయిర్ ఈరోజు ఉదయం క్రికెట్ డైరెక్టర్‌కు తెలిపాడు’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

    దీంతో హెట్‌మెయిర్‌ను జట్టు నుంచి తొలగించి, బ్రూక్స్‌ను ఆడించాలని బోర్డు మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించిందని వివరించింది.

    శనివారం నుంచి సోమవారానికి ప్రయాణాన్ని మార్చినప్పుడే హెట్‌యిర్‌కు స్పష్టంగా చెప్పామని, ఈసారి ప్రయాణం ఆలస్యమైతే అతడిని జట్టు నుంచి తప్పిస్తామని ముందే వెల్లడించామని కూడా పేర్కొంది.

  15. జపాన్ మీదుగా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

    ఉత్తర కొరియా క్షిపణి

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర జపాన్‌లోని కొంత భాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

    ఈ మిస్సైల్ ప్రయాణ సమయంలో హొక్కైడో ద్వీపంలోని ప్రజలంతా తమను తాము కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రైళ్ల రాకపోకలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది.

    2017 తర్వాత జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణిని పేల్చడం ఇది తొలిసారి.

    ఉత్తర కొరియా బాలిస్టిక్, న్యూక్లియర్ ఆయుధ పరీక్షలు జరపకుండా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించింది.

    ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.

  16. జమ్మూ కశ్మీర్ డీజీపీ హేమంత్ లోహియా ‘హత్య’.. ఇంటిలోనే గొంతు కోసి చంపారంటున్న పోలీసులు

    జమ్మూ కశ్మీర్ డీజీపీ

    ఫొటో సోర్స్, ani

    జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) హేమంత్ లోహియా మరణించారు. ఆయనను ఇంట్లోనే గొంతు కోసి చంపారని పోలీసులు ప్రకటించారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    జమ్మూ కశ్మీర్ అడిషనల్ డీజీపీ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ.. హేమంత్ లోహియా ఇంట్లో పనిచేసే వ్యక్తి పారిపోయాడని, అతని కోసం వెదుకుతున్నామని చెప్పారు.

    రెండు నెలల కిందటే ఐపీఎస్ అధికారి హేమంత్ లోహియా జమ్మూ కశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు. నగర శివార్లలోని ఉదయవాలాలో ఆయన నివాసం ఉంటున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి జమ్మూ చేరుకున్నారు.

    దేశ హోం శాఖ మంత్రి పర్యటన జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర డీజీపీ హత్య జరగడంతో స్థానికంగా భద్రతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  17. గుడ్ మార్నింగ్..

    బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం.

    ఇప్పటి వరకూ ఉన్న ముఖ్యాంశాలు..

    • భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ మూడవ మ్యాచ్ ఈరోజు ఇండోర్‌లో జరుగనుంది.
    • టీ20 ప్రపంచకప్‌కు భారత పేసర్ బుమ్రా గాయం కారణంగా దూరం అయ్యాడని బీసీసీఐ ప్రకటించింది.
    • ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని జపాన్‌ భూభాగం మీదుగా పరీక్షించిందని జపాన్, దక్షిణ కొరియా దేశాలు ప్రకటించాయి.
    • జమ్మూ కశ్మీర్ డీజీపీ (జైళ్లు) హేమంత్ లోహియా ఆయన నివాసంలోనే హత్యకు గురయ్యారు.