నోబెల్ 2022: మెడిసిన్ విభాగంలో స్వాంటే పేబోకు బహుమతి

ప్రముఖ ఫిజియాలజిస్ట్ స్వాంటే పేబోకు నోబెల్ బహుమతి వచ్చింది. అంతరించి పోయిన మానవజాతుల మీద, మానన పరిణామక్రమం మీద స్వాంటే పేబో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.

  2. ఇరాన్‌లో అల్లర్లకు అమెరికా, ఇజ్రాయెల్ కారణం: అలీ ఖొమేనీ

    ఖొమేనీ

    ఫొటో సోర్స్, Getty Images

    తమ దేశంలో నిరసనలు, కల్లోలిత పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది.

    ఈ అంశంపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖొమేనీ తాజాగా స్పందించారు.

    ‘‘అల్లర్లు, కల్లోలిత పరిస్థితుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

    విదేశాల్లో ఉంటున్న కొందరు దేశద్రోహ ఇరానియన్లు ఆ రెండు దేశాలకు సాయం చేస్తున్నారు’’అని ఖొమేనీ వ్యాఖ్యానించారు.

    ఖుర్దు యువతి 22ఏళ్ల మహసా అమీనీ మృతి అనంతరం ఇరాన్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి.

    టెహ్రాన్‌కు వచ్చినప్పుడు హిజాబ్ సరిగా ధరించలేదని మొరాలిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నాయి.

    వారి నిర్బంధంలో ఉన్నప్పుడే ఆమె మరణించారు.

    ఈ నిరసనల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని ఇప్పుడు ఖొమేనీ ఆరోపిస్తున్నారు.

    అయితే, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను ఆయన బయటపెట్టలేదు.

  3. ఖతర్‌లో బతుకమ్మ సంబరాలు

  4. రాయలసీమలో కొరియా రుచులు

  5. కనుపాపల రంగు ఎందుకు మారుతుంటుంది- ఇది సాధారణమేనా.. ట్యూమర్లకు సంకేతమా?

  6. యుక్రెయిన్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి? ఆయుధాల కోసం ఫ్రాన్స్‌పై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు

  7. గాంధీ పోలికలతో మహిషాసుర విగ్రహం.. హిందూ మహాసభ దుర్గాపూజలో వివాదం

  8. నోబెల్ మెడిసిన్ పురస్కారం 2022లో ఎవరికి దక్కింది?

    శాస్త్రవేత్త స్వాంటే పేబో
    ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్త స్వాంటే పేబో

    ప్రముఖ ఫిజియాలజిస్ట్ స్వాంటే పేబోకు నోబెల్ బహుమతి వచ్చింది.

    2022 సంవత్సరానికి ఫిజియాలజి లేదా మెడిసిన్ విభాగంలో ఆయన నోబెల్‌కు ఎంపిక అయ్యారు.

    అంతరించి పోయిన మానవజాతుల మీద, మానన పరిణామక్రమం మీద స్వాంటే పేబో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.

    అంతరించి పోయిన నియాండెర్తల్ జాతి మానవుని జన్యుపటాన్ని ఆయన ఆవిష్కరించగలిగారని ప్రశంసించింది.

    అలాగే డెనిసోవా అనే కొత్త మానవ జాతిని కూడా ఆయన ఆవిష్కరించారని నోబెల్ కమిటీ తెలిపింది.

    స్వీడన్‌కు చెందిన పేబో కొన్ని దశాబ్దాలుగా మానవ పరిణామ క్రమం మీద పరిశోధనలు చేస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. భారత్ గగనతలంలో ఇరాన్ విమానంలో... అందులో బాంబు?

    ఇరాన్ విమానం

    ఫొటో సోర్స్, Getty Images

    బాంబు ఉందని వార్తలు వచ్చిన ఇరాన్ విమానం భారత గగనతలం నుంచి వెళ్లి పోయిందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తెలిపింది.

    ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న ఆ విమానంలో బాంబు ఉందనే వార్తలు రావడంతో భారత్ అప్రమత్తమైంది.

    ఇరాన్ విమానాన్ని ట్రాక్ చేయడానికి ఐఏఎఫ్ ఒక విమానాన్ని పంపింది. కావాలంటే జైపుర్ లేదా చండీగర్‌లో ల్యాండ్ కావొచ్చని ఇరాన్‌కు చెందిన విమాన పైలెట్‌కు ఆఫర్ ఇచ్చినా అందుకు వారు సుముఖత వ్యక్తం చేయలేదు.

    చివరకు బాంబు బెదిరింపుల్లో నిజం లేదని భారత్‌కు ఇరాన్ చెప్పింది. మొత్తానికి ఇరాన్‌కు చెందిన ఆ విమానం భారత గగనతలం నుంచి చైనా వైపు వెళ్లి పోయినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.

  10. కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

  11. మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్

    మునుగోడు ఉపఎన్నిక నవంబరు 3న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

    మహారాష్ట్ర, బిహార్, హరియాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో మొత్తం ఏడు సీట్లకు ఉపఎన్నికలను అదే రోజున నిర్వహిస్తున్నారు.

    కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

    6వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన ఉంటాయి. ఈనెల 14వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

    మునుగోడు ఉపఎన్నిక జాబితా

    ఫొటో సోర్స్, ECI

  12. ‘ఇక నుంచి ఫోను వస్తే హలోకు బదులు వందేమాతరం అనండి’

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే

    ఫొటో సోర్స్, Facebook/Eknath Shinde - एकनाथ संभाजी शिंदे

    ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే

    ఇక నుంచి ఫోన్ ఎత్తగానే ‘హలో’కు బదులు ‘వందేమాతరం’ అనాలని మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.

    ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిధులు పొందే సంస్థల్లోని ఉద్యోగులు తప్పకుండా దీన్ని పాటించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ తీర్మానం చేసింది.

    ఈ తీర్మానం ప్రకారం, ప్రజలు లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఫోన్ చేసినప్పుడు ఉద్యోగులు తప్పనిసరిగా ‘వందేమాతరం’ అని పలకరించాలి.

    ఆఫీసుకు పనుల కోసం వచ్చే ప్రజలను కూడా ‘వందేమాతరం’ అంటూ పలకరించాలని తెలిపింది.

    ‘హలో’ అనడం అనేది పశ్చిమ దేశాల సంస్కృతి అని దానికి ఎటువంటి అర్థం లేదని ప్రభుత్వం చేసిన తీర్మానం చెబుతోంది.

  13. ఆర్ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే పేదరికం, నిరుద్యోగంపై ఏమన్నారు?

    ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే

    దేశంలో పెరిగిపోతున్న పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు.

    ‘ఈ దేశంలో దారిద్ర్యం అనేది ఒక భూతంలా తయారైంది. ఈ భూతాన్ని అంతం చేయడం చాలా ముఖ్యం.

    నేటికీ సుమారు 20 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు. ఇది చాలా బాధాకరం.

    23 కోట్ల మంది రోజుకు రూ.375 కంటే తక్కువ సంపాదిస్తున్నారు.

    నాలుగు కోట్ల మందికి ఉపాధే లేదు.

    దేశంలో నిరుద్యోగిత రేటు 7.6శాతం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి’ అని స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘ప్రపంచంలోని అతి పెద్ద ఆరు ఆర్థికవ్యవస్థల్లో భారత్ ఒకటని చెబుతున్నారు. అది సంతోషించాల్సిన విషయమా?

    దేశ జాతీయ ఆదాయంలో 20శాతం సంపద ఒక శాతం మంది వద్దే పోగుబడి ఉంది. ఇదే సమయంలో 40శాతం దేశ జనాభా వద్ద ఉన్న సంపద 13శాతం మాత్రమే.

    దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు మంచి నీరు, పౌష్టిక ఆహారం లభించడం లేదు. నాణ్యత లేని విద్యావ్యవస్థ, పర్యావరణ మార్పుల వల్ల కూడా పేదరికం పెరుగుతోంది.

    మరొక వైపు ప్రభుత్వాల అమసర్థత కూడా దీనికి కారణం అవుతోంది.

    ఉపాధి కోసం గ్రామాలు వదలి పట్టణాలకు రావడమనేది సమస్యాత్మకంగా మారుతోంది. అందువల్ల గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచాలి. అందుకే మేం స్వాభిమానీ భారత్ అభియాన్‌ను ప్రారంభించాం’ అని దత్తాత్రేయ అన్నారు.

    ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే
  14. బ్రెజిల్ ఎన్నికల్లో వెనుక బడ్డ బోల్సొనారో... మరొకసారి జరగనున్న ఎన్నికలు

    బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు

    ఫొటో సోర్స్, Reuters

    బ్రెజిల్‌ ఎన్నికలు రెండో సారి జరగనున్నాయి. తొలి రౌండ్ ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సొనారో వెనుకబడ్డారు.

    తొలి రౌండ్‌లో బోల్సొనారోకు కానీ ఆయన మీద పోటీ చేస్తున్న లులా డిసిల్వాకు కానీ మెజారిటీ రాలేదు. అంటే వీరిలో ఎవరికీ 50శాతం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు.

    తొలి రౌండ్‌లో ప్రతిపక్ష నేత లులాకు 48శాతం ఓట్లు రాగా బోల్సొనారోకు 43శాతం వచ్చాయి.

    దాంతో మరొక నెల రోజుల్లో రెండో సారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

  15. కెనడా: శ్రీ భగవద్గీత పార్కు మీద దాడి జరిగిందా? భారత్, కెనడా దేశాలు ఏమన్నాయి?

    ఇటీవల కెనడాలో ప్రారంభించిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ను ధ్వంసం చేశారు అనే వార్తల మీద భారత్ నిరసన తెలిపింది. ఆ ఘటన మీద పూర్తి విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కోరింది.

    కెనడాలోని బ్రాంప్టన్‌ మున్సిపాలిటీలో ఇటీవల ఒక పార్కుకు ‘శ్రీ భగవద్గీత’ అని పేరు పెట్టారు.

    కొద్ది రోజుల కిందట ఆ పార్కు మీద దాడి జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

    ‘బ్రాంప్టన్‌లోని శ్రీ భగవద్గీత పార్కు మీద జరిగిన ద్వేష పూరిత ఘటనను మేం ఖండిస్తున్నాం. దీని మీద వెంటనే విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని కెనడా అధికారులను, పీల్ ప్రావిన్సియల్ పోలీసులను కోరుతున్నాం’ అని కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అయితే పార్కును ధ్వంసం చేయలేదని, పార్కు పేరు ఉన్న బోర్డుకు మాత్రమే డ్యామేజీ జరిగిందని బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  16. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.