పుతిన్‌కు ఘోర పరాభవం.. రష్యా నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాల్లో ప్రజల సంబరాలు

వీడియో క్యాప్షన్, ఈశాన్య యుక్రెయిన్‌లో 20 గ్రామాలను రష్యా పట్టులోంచి విముక్తి చేశామంటున్న యుక్రెయిన్ సైన్యం

కొన్ని నెలల ప్రతిష్టంభన తర్వాత యుక్రెయిన్ దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో - రష్యా అధీనంలో ఉన్న కొన్ని వేల చదరపు మైళ్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి యుక్రెయిన్ బలగాలు.

వాటి కోసం భీకర దాడులు ఎదురు దాడులు చేశాయి. యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమిత ప్రాంతాలను ఒక్కొక్కటిగా విముక్తి చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ప్రకటించారు.

కీలక వ్యూహాత్మక నగరం ఇజియుం వాటిలో ఒకటి.

ఖార్కియేవ్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తోన్న రిపోర్ట్.

ఆదరాబాదరాగా వెనక్కు మళ్లాయి రష్యన్ సైన్యాలు.

రష్యా ఫైర్ పవర్ ఇప్పడు యుక్రెయిన్ చేతుల్లో ఉంది.

కానీ తమ బలగాలను మళ్లీ మోహరించామని రష్యా చెబుతోంది. కొన్ని చోట్ల వాళ్లు పారిపోయినట్లుగా కనిపిస్తోంది.

అధ్యక్షుడు పుతిన్‌కు ఇది పరాజయం మాత్రమే కాదు, ఘోర పరాభవం కూడా.

ఇజియుం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది యుక్రెయిన్‌ సాధించిన కీలక విజయంగా చెప్పుకోవచ్చు. రష్యన్లకు ఇజియుం కీలక స్థావరంగా ఉండేది.

కొత్తగా విముక్తి అయిన ప్రాంతాల్లో యుక్రెయిన్ బలగాలకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఇవన్నీ త్వరత్వరగా సాధించిన విజయాలు. యుక్రేనియన్లు ఎంతగానో ఎదురుచూస్తున్నవి.

వాళ్ల ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.

కానీ కొందరు మాత్రం యుద్ధం మిగిల్చిన గాయాలను జీవితాంతం భరించాల్సిందే. దక్షిణాదిలోని ఖెర్సాన్‌కు చెందిన విక్టర్ వారిలో ఒకరు.

రష్యన్ల క్రూరత్వానికి, షెల్లింగ్‌కు బాధితుడు విక్టర్. పూర్తిగా కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుంది.

విక్టర్‌ను మోకరిల్లమని, లేదంటే కాల్చి చంపేస్తామని రష్యన్ సైనికుడు బెదిరించాడు. ఆయన వెంటనే మోకాలిపై కూర్చోలేకపోయారు. దాంతో దారుణంగా కొట్టారు. 'నా ప్రాణాలు పోతున్నాయనే అనుకున్నా' అని ఆయన చెప్పారు.

కానీ తాజా విజయాలతో యుక్రెయిన్ బలగాలు ఉత్సాహంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రజల్లో మనోస్థైర్యం పెరుగుతోంది. ఇదొక కీలక ముందడుగు అని ప్రజలు ధైర్యంగా నమ్ముతున్నారు.

ఈ ప్రాంతాల్లో రష్యా సైనిక లక్ష్యాలు ఎలా విఫలమయ్యాయో చూడొచ్చు. కానీ ఇది ఈ యుద్ధానికి ముగింపు మాత్రం కాదు.

రష్యా బలంగా ఎదురుదాడి చేయొచ్చు. ఎందుకంటే... యుక్రెయిన్‌ను ఆక్రమించుకునే విషయంలో ప్రెసిడెంట్ పుతిన్ దీర్ఘ దృష్టితో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)