కెన్యాలో బాల్య వివాహాల బారిన పడుతున్న బాలికలు...
కెన్యాలో బాల్య వివాహాలను 2001లో రద్దు చేశారు. కానీ ఇప్పటికీ ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి 15 ఏళ్లు కూడా నిండకముందే పెళ్లి చేస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఉత్తర కెన్యాలోని సాంబూరు కౌంటీ వంటి ప్రాంతాల్లో పశువులను మేపుతూ జీవించే పాక్షిక సంచార జాతుల ప్రజల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ – అంటే స్త్రీ జననేంద్రియాలను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించటం కూడా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ సమాజంలో 86 శాతం మందికి పైగా బాలికలు ఈ బలవంతపు ఎఫ్‌జీఎంకు గురవుతున్నారు.
బాల్య వివాహాల ప్రభావం గురించి మరింత తెలుసుకోవటానికి బీబీసీ ఫోకస్ ఆన్ ఆఫ్రికా ప్రతినిధి లీసా మేరీ మిస్జాక్.. సాంబూరు కౌంటీ వెళ్లారు. ఆమె అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కృష్ణంరాజు: మొగల్తూరు నుంచి మొదలై దిల్లీ దాకా సాగిన రెబెల్ స్టార్ ప్రయాణం
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)