యుక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న గ్రామాల్లో జనం ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకున్న గ్రామాల్లో జనం ఏమంటున్నారు?

సెప్టెంబర్ ఆరంభం నుంచి తమ బలగాలు సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ శనివారం నాడు చెప్పారు.

ఆదివారం నాడు సైన్యం ఒక ప్రకటన చేస్తూ.. తాము 3,000 కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నామని చెప్పింది.

ప్రస్తుతం బీబీసీ ప్రతినిధులు సహా జర్నలిస్టులను యుద్ధ రంగానికి దూరంగా ఉంచుతున్నారు. యుక్రెయిన్ చెప్తున్న వాదనలన్నిటినీ మేం తనిఖీ చేయలేం.

అయితే ఖార్కియేవ్ నుంచి తమ సైనిక బలగాలు వెనుదిరిగాయని రష్యా అంగీకరించింది. ఆ బలగాలను తిరిగి 'ఏకీకరణ' చేశామని చెప్పింది.

రష్యా నుంచి విముక్తి పొందిన గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)