జపోరిఝియా అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి మళ్లీ మొదలైన విద్యుత్ సరఫరా

వీడియో క్యాప్షన్, రేడియో అణుధార్మిక ప్రమాదాన్ని ప్రపంచం తృటిలో తప్పించిందన్న యుక్రెయిన్ అధ్యక్షుడు

యూరప్‌ను రష్యా... అణుధార్మిక ప్రమాదం ముని వాకిటి వరకూ తీసుకొచ్చిందని ఆరోపించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ.

జపోరిఝియా అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి పవర్ గ్రిడ్‌తో అనుసంధానాన్ని తాత్కాలికంగా తొలగించిన తర్వాత ఆయన మాట్లాడారు.

రష్యన్ సేనల ఆధీనంలో ఉన్న జపోరిఝియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ‌కేబుల్స్ కాలిపోవడంతో దాన్ని పవర్ గ్రిడ్ నుంచి తప్పించారు.

త్వరలోనే ఈ కేంద్రానికి ఐక్యరాజ్య సమితి పరిశీలకులను పంపించాలని యుక్రెయిన్ భావిస్తోంది.

బీబీసీ ప్రతినిధి గరెత్ బార్లో అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)