అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?

వీడియో క్యాప్షన్, అమిత్ షా చెప్పులు మోశారంటూ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ జవాబు ఏంటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బూట్లను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెచ్చి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆగస్టు 21న తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ఈ వీడియో తెలంగాణలో రాజకీయంగా వాగ్వాదాలకు, విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసింది.

అమిత్ షా పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

మహంకాళి ఆలయంలోకి వెళ్లిన అమిత్ షా, బయటకు వస్తుండగా, బండి సంజయ్ పరుగుపరుగున వెళ్లి బూట్లను తీసుకొచ్చి అమిత్ షా ముందు పెట్టారు.

ఈ విషయంలో తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఏమని విమర్శించారు, దానికి బీజేపీ ఏమని సమాధానం ఇచ్చింది...ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)