బర్మింగ్‌హామ్: బోర్న్‌విల్లే గ్రామంలో క్యాడ్‌బరీ చాక్లెట్‌ మ్యూజియం..

వీడియో క్యాప్షన్, అందరూ మెచ్చే, నోరూరించే రకరకాల రంగుల చాక్లెట్‌పై ప్రత్యేక కధనం

చాక్లెట్ అంటే ఇష్టపడని వారుండరేమో.

చిన్న పిల్లల దగ్గర్నుండి వృద్ధుల వరకూ అందరూ మెచ్చే, నోరూరించే చాక్లెట్ రకరకాల రంగుల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి.

మరి అలాంటి చాక్లెట్ అంతా ఒకేచోట కనిపిస్తే ఎలా ఉంటుంది?

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ సమీపంలోని బోర్న్‌విల్లే గ్రామం ఇది.

ఒకే చోట ఇంత చాక్లెట్‌ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు.

భారతదేశంలో క్యాడ్‌బరీ చాక్లెట్‌ను తినడం చూస్తుంటాం. దాని సాగు దశాబ్దాల క్రితమే ఇక్కడ ప్రారంభమైంది.

చాక్లెట్ మ్యూజియంలోని క్యాడ్‌బరీ వల్డ్‌లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

1840లో జాన్ క్యాడ్‌బరీ అనే వ్యక్తి 'క్యాడ్‌బరీ' కంపెనీని ప్రారంభించారు.

జాన్ ఇద్దరు కొడుకులూ కలిసి 1879లో బోర్నెవిల్లే గ్రామంలోని ఈ స్థలంలో చాక్లెట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు.

ఇక్కడకొచ్చి మీరు చాక్లెట్ తింటూనే ఈ చరిత్రంతా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)