ఆంధ్రప్రదేశ్: 94 ఏళ్ళ వయసులో రోజూ 130 కి.మీ. ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: 94 ఏళ్ళ వయసులో రోజూ 130 కి.మీ. ప్రయాణించి పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్

చేతి కర్ర సాయంతో నడుస్తున్న ఈ పెద్దావిడ వయసు 94 ఏళ్లు. ఈ వయసులోనూ ఈమె యూనివర్సిటీ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. దీనికోసం ఈమె రోజు విశాఖ నుంచి విజయనగరానికి రానుపోను 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. ప్రొఫెసర్ శాంతమ్మ 75 ఏళ్లుగా ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్నారు.

శాంతమ్మ 1951లో ఆంధ్ర యూనివర్శిటీలో ఫిజిక్స్ లెక్చరల్‌గా చేరారు. 1989లో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత కూడా ఏయూలో గౌరవ అధ్యాపకురాలిగా కొనసాగారు. ప్రస్తుతం విజయనగరంలోని సెంచురియన్ వర్సిటీలో బీఎస్సీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు జామెట్రీ ఆప్టిక్స్, ఫిజికల్ ఆఫ్టిక్స్ పాఠాలు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)