అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ దీవిలోకి అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న చైనా

వీడియో క్యాప్షన్, పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోన్న చైనా

అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తారంటూ వస్తున్న వార్తలు జో బైడెన్ ప్రభుత్వంలో కలకలం రేపుతున్నాయి.

ఈ పర్యటనతో అమెరికా హద్దులు దాటినట్లే చైనా భావిస్తుందని అమెరికన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

దాన్ని నివారించగల మార్గం కూడా ఏదీ లేకపోవచ్చని వారు భావిస్తున్నారు.

తైవాన్ దీవిపై సార్వభౌమాధికారం తమదేనని వాదిస్తున్న చైనా దీనిపై ఇప్పటికే కఠిన హెచ్చరికలు కూడా చేసింది.

అవసరమైతే సైనిక చర్యకు దిగుతామనే సంకేతాలు కూడా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడి షీ జిన్ పింగ్‌తో ఫోన్‌వో మాట్లాడనున్నారు.

బీబీసీ ప్రతినిధి గారెత్ బార్లో అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)