బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్- లిజ్ ట్రస్ మధ్య తుది పోరు

వీడియో క్యాప్షన్, కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, బ్రిటిష్ ప్రధాని పదవి పోటీలో రిషి సునక్,లిజ్ ట్రస్

కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పదవికీ, తద్వారా బ్రిటిష్ ప్రధాని పదవిని చేపట్టేందుకు జరుగుతున్న పోటీలో లిజ్ ట్రస్, రిషి సునక్‌ ఇద్దరూ తుదిఘట్టానికి చేరుకున్నారు.

రాబోయే కొన్ని వారాలు ఈ ఇద్దరు నేతలకూ చాలా కీలకం.

తానే సరైన అభ్యర్థినని తమ పార్టీలోని లక్షా 60 వేల మంది సభ్యులను ఒప్పించడం ఈ ఇద్దరు నేతల ముందున్న అసలైన సవాలు.

టెన్‌ డౌనింగ్‌ స్ట్రీట్ కోసం పోటీ జోరందుకుంటున్న సమయంలో, త్వరలో ఈ ఆఫీసుని ఖాళీ చేయబోతున్న బోరిస్ జాన్సన్ తనదైన ప్రత్యేక శైలిలో నిష్క్రమిస్తున్నారు.

బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధానిని ఎంపీలు ప్రశ్నలు అడిగే కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)