Plastic Recycling: వాడిపారేసే ప్లాస్టిక్‌లో రీసైక్లింగ్ అవుతోంది ఎంత? పూర్తిగా రీసైక్లింగ్ ఎందుకు కావట్లేదు?

వీడియో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో సగం కూడా రీ సైక్లింగ్ కావట్లేదా?

ప్రతి ఏటా కోటి పది లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రంలో కలుస్తున్నాయంటోంది ఐక్యరాజ్యసమితి. ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తున్న దేశాలలో కూడా కొంతమేరకు మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. ప్లాస్టిక్ వ్యర్ధాల రీసైకిలింగ్ ఎంత ప్రభావంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి .... ఆ వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం...

ప్లాస్టిక్ వ్యర్ధాల గురించి ఎంతగానో చర్చిస్తున్నప్పటికీ మనం గతంలో కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తున్నాం.

ఈ గందరగోళం నుంచి బయటపడి రీసైక్లింగ్ కోసం నిజంగా మార్గాన్వేషణ చేయగలమా?

ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అవుతోంది.

తక్కువ మొత్తానికి కారణాలేంటి?

''చెత్తను సేకరించడంలోనే సమస్యున్నాయి. చాలా దేశాల్లో ప్లాస్టిక్ చెత్తను సేకరించే మౌలిక వసతులు లేవు. కాబట్టే చాలా వరకు ప్లాస్టిక్ రీసైకిల్ కావడం లేదు'' అని ప్లాస్టిక్ వేస్ట్ ఎక్స్పర్ట్ ధర్మేష్ షా చెప్పారు.

ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడంలో జర్మనీ బాగా పనిచేస్తుంది.

వారు 99 శాతం ప్లాస్టిక్ చెత్తను సేకరిస్తున్నారు.

సేకరించిన దానిలో సగం కంటే తక్కువగానే రీసైకిల్ చేస్తున్నారు.

మిగతాది బాగా మురికి పట్టి ఉండటం లేదా వేరు చేయడానికి వీలు కాకుండా ఉంటోంది.

ఇందులో చాలా వరకూ బూడిదగా మారుతోంది.

రీసైక్లింగ్‌కి ఎంచుకున్న భాగంలో మూడో వంతు విదేశాలకు ఎగుమతి అవుతోంది.

''సంపన్న దేశాల్లో చెత్తను సేకరించడానికి వనరులు ఉన్నాయి. కాబట్టి ఆసియా దేశాల్లో మాదిరిగా మరెక్కడా వీధుల్లో చెత్త అంతగా కనిపించదు. వాటిని దాచడానికి లేదా విదేశాలకు ఎగుమతి చేయడానికి వారి వద్ద వనరులున్నాయి'' అని ధర్మేష్ షా అన్నారు.

ఇక్కడ నుంచి వెళ్లాక అది ఎక్కడకు చేరిందో కనుక్కోవడం కూడా కష్టమే

యూరప్ దేశాలు, బ్రిటన్, జపాన్ నుంచి టర్కీ, థాయిలాండ్, వియత్నం, పాకిస్తాన్, ఇండియా, హాంకాంగ్, మెక్సికో ప్లాస్టిక్ వ్యర్థాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

అసలు రీసైక్లింగ్ చేయడం ఎందుకు అంత కష్టం?

ప్లాస్టిక్‌లో ఏడు రకాలున్నాయి.

అందులో మొదటిది బాటిల్స్ కోసం వాడే ప్లాస్టిక్- దీన్ని రీసైకిల్ చెయ్యడం చాలా సులభం.

ఇవి సాధారణంగా అంత కలుషితమైనవి కావు.

యూరప్‌లో 60 శాతం ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తున్నారు.

కానీ వాటిల్లో మూడో వంతు కన్నా తక్కువ మాత్రమే కొత్త బాటిళ్లుగా మారుతున్నాయి.

రీసైక్లింగ్ ప్రక్రియలో కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తుల నాణ్యత దెబ్బ తింటోంది.

31 శాతం మాత్రం ట్రేలుగా మారుతున్నాయి.

నాలుగోవంతు దుస్తులు లేదా పాలిస్టర్‌గా మారుతాయి.

ట్రేలు, దుస్తుల్ని తరచుగా రీసైక్లింగ్ చెయ్యడం లేదు.

''ఇక్కడ అర్థశాస్త్రాన్ని తప్పుబట్టాలి ఎందుకంటే ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం కన్నా కొత్తది తయారు చేయడమే చౌక'' అని ధర్మేష్ షా తెలిపారు.

రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో వస్తువులను తయారు చేద్దామని తయారీదారులు అనుకున్నా.. ప్రస్తుతం అందుకు సరిపడా రీసైకిల్డ్ ప్లాస్టిక్ లేదు.

ప్రజలు కొత్త ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారనే వాస్తవంపై చమురు సంస్థలు ఆధారపడుతున్నాయి.

''రానున్న పదేళ్లలో ప్లాస్టిక్ ఉత్పత్తి తగ్గదు. ఇంకా పెరుగుతుంది. అందులో అమెరికా అగ్రస్థానంలో ఉంది. రానున్న పదేళ్లలో చమురు రసాయన ఉత్పత్తులని పెంచాలని అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది. చైనా కూడా అదే బాటలో ఉంది'' అని ధర్మేష్ షా వెల్లడించారు.

ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించేందుకు మరో రెండు సులువైన మార్గాలు ఉన్నాయి.

అంటే మనం తయారు చేసేవాటిని తగ్గించడం, వీలున్న వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడం.

అది సాధ్యం కూడా.

బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోంది కోకకోలా

అయితే ఆ సంస్థ మేము ఈ సమస్య పరిష్కారానికి నాయకత్వం వహిస్తామని చెబుతోంది.

బ్రెజిల్‌లో 2018 నుంచి వాడి మళ్లీ నింపగలిగిన ప్లాస్టిక్ సీసాలను వాడకంలోకి తెచ్చారు.

దీని వల్ల ఏటా 20 కోట్ల బాటిళ్లను ఆదా చేస్తున్నట్టు చెబుతోంది.

కానీ ప్రతీ ఏటా 46 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది.

ఈ లెక్కల ప్రకారం చూస్తే ఉత్పత్తి అయ్యేదంతా రీసైక్లింగ్‌కు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)