Hong Kong: బ్రిటన్ పాలన నుంచి చైనా చేతుల్లోకి వచ్చి పాతికేళ్లు.. ఇప్పుడేం జరుగుతోంది?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాంగ్ కాంగ్ చేరుకున్నారు. కోవిడ్ మహమ్మారి మొదలయ్యాక ఆయన చైనా మెయిన్‌లాండ్ బయట పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ ప్రాంతానికి కొత్త నేత ఎంపికను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. హాంగ్ కాంగ్ చైనా పాలనలోకి వచ్చి 25 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
2047లో - చైనాలో - హాంగ్ కాంగ్ అంతర్భాగం అయ్యేంత వరకూ దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని బ్రిటన్, చైనా అంగీకరించాయి.
అయితే 2020లో ఈ ప్రాంతంపై చైనా రుద్దిన చట్టాలు - విమర్శకుల గొంతు నొక్కేశాయి. చైనా చట్టాలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు, విద్యార్థులు ఉద్యమించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హాంగ్ కాంగ్ చరిత్రలోనే వాళ్లు అత్యంత కఠినమైన రోజుల్ని ఎదుర్కొన్నారు.
25 ఏళ్ల క్రితం హాంగ్ కాంగ్‌ను చైనాకు అప్పగించింది బ్రిటన్. ఈ ప్రాంత పౌరుల మౌలిక హక్కుల్ని కాపాడతామని హామీలిచ్చారు. గత రెండేళ్లలో ఆ హామీలన్నింటినీ పూర్తిగా తుంగలో తొక్కారు.
హాంగ్ కాంగ్ ఇప్పుడొక సాధారణ చైనా నగరంగా మారిపోతోంది.
ఇవి కూడా చదవండి:
- ఉదయ్‌పుర్, కరౌలి, జోధ్‌పుర్, అల్వార్.. ఈ రాజస్థాన్ నగరాల్లో ఏం జరుగుతోంది?
- రోజూ 2 గంటలపాటు ఒంటి కాలితో కుంటుతూ స్కూలుకు వెళ్తున్న బాలిక
- సుప్రీంకోర్టు: ‘నూపుర్ శర్మ నోటి దురుసుతో దేశంలో మంట పెట్టారు.. దేశ భద్రతకే ముప్పు తెచ్చారు’
- రెండుసార్లు సీఎం.. ఇప్పుడు డిప్యూటీ సీఎం.. దేవేంద్ర ఫడణవీస్ స్థాయిని బీజేపీ అధిష్ఠానం తగ్గించిందా?
- శ్రీలంక: 'పెట్రోలు కోసం రెండు రోజుల నుంచి స్నానం కూడా చేయకుండా కారులోనే ఉన్నా'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)