లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
ఇంతటితో ఈ లైవ్ పేజీ అప్‌డేట్స్ ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం లైవ్ పేజీ అప్‌డేట్స్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు.
ఒడిశాలో పూరి జగన్నాథ రథ యాత్ర ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు.
ఇంతటితో ఈ లైవ్ పేజీ అప్‌డేట్స్ ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం లైవ్ పేజీ అప్‌డేట్స్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు.

ఫొటో సోర్స్, Facebook/Naveen Patnaik
ఒడిశాలో పూరి జగన్నాథ రథ యాత్ర ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు.
ఈ రథయాత్ర సుమారు 9 రోజులపాటు జరుగుతుంది.

ఫొటో సోర్స్, Facebook/Naveen Patnaik

ఫొటో సోర్స్, Facebook/Naveen Patnaik

ఫొటో సోర్స్, Facebook/Naveen Patnaik

ఫొటో సోర్స్, Facebook/Naveen Patnaik

ఫొటో సోర్స్, Twitter/@ZOO_BEAR
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టులో దిల్లీ పోలీసులకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
మత విశ్వాసాలకు సంబంధించి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ మహ్మద్ జుబైర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో దిల్లీ పోలీసులకు తనను రిమాండ్‌కు ఇవ్వడానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో జుబైర్ పిటీషన్ వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నూపుర్ శర్మ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
శర్మ పిటీషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత అసదుద్దీన్ ఒవైసీ ఏఎన్ఐతో మాట్లాడారు.
"దేశ ప్రధాని ఈ విషయాలన్నీ రెండోసారి వింటున్నారు. అయినా ఇంకా రియాక్ట్ అవ్వారా? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సస్పెన్షన్ శిక్ష కాదని ప్రధాని తెలుసుకోవాలి. మీరు నూపుర్ శర్మకు మాత్రమే కాదు, దేశంలోని 133 కోట్ల మంది ప్రజలకు ప్రధాని అని, ఇందులో దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని మేం ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నూపుర్ శర్మను మీరు ఎంతకాలం కాపాడతారని ప్రధానమంత్రిని అడుగుతున్నా. ఆమెను ఎందుకు అరెస్టు చేయట్లేదు?" అని ఒవైసీ ప్రశ్నించారు.
"హైదరాబాద్‌లో వాళ్ల జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. నూపుర్ శర్మ అందులో సభ్యురాలు. నుపుర్ శర్మను అక్కడికి రమ్మని దేశ ప్రధాని ఆహ్వానించారా? జాతీయ కార్యవర్గం దీనిపై స్పందిస్తుందా? ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారుగానీ, ఇంకా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలే" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ కూడా సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించారు. అధికార పార్టీ సిగ్గుతో తల దించుకునేలా కోర్టు తీర్పునిచ్చిందంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
"సుప్రీంకోర్టు, ప్రభుత్వం ముసుగు తొలగించి, అసలు రూపం చూపించింది. మతపరమైన ఉద్రిక్తతలను పెంచి పోషించి, బీజేపీ ప్రయోజనం పొందుతుందన్నది రహస్యం కాదు. దేశాన్ని నాశనం చేసే ఇలాంటి భావజాలంతో పోరాడుతున్న ప్రతి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కోర్టు తీర్పు ఇచ్చింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య కూడా నూపుర్ శర్మ బాధ్యతా రహిత ప్రకటనను ఖండిస్తూ, ఆమె దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కొత్త ప్రభుత్వంతో మహారాష్ట్రకు మేలు జరగాలని మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
"ఈ ప్రభుత్వం ఏర్పాటైన తీరు, శివసైనికులుగా చెప్పుకునే వారు ముఖ్యమంత్రి కావడం.. ఇది ఇంకా గౌరవప్రదంగా జరిగి ఉండవచ్చు. ఇలా జరగాలని రెండేళ్ల క్రితమే అమిత్ షాకు చెప్పాను. శివసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు రెండున్నరేళ్ల పాటు శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పాను. అలా జరిగి ఉంటే మహా వికాస్ అఘాడి ఉండేది కాదు. అప్పుడు తిరస్కరించి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజల్లో గందరగోళం సృష్టించి శివసైనికుడిని ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీఎం శివసేన సీఎం కాదు" అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తరువాత తొలిసారిగా శివసేన భవన్‌కు వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే విలేఖరులతో మాట్లాడారు.
"నాపై కోపాన్ని ముంబైవాసుల మీద చూపించవద్దు. మెట్రో షెడ్ ప్రతిపాదన మార్చకండి. ముంబై పర్యావరణంతో ఆడుకోవద్దు" అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు

ఎక్కడైనా క్యూలో ఉన్నప్పుడు మొదటి ప్లేసులో ఉంటే బాగానే ఉంటుంది. కానీ, ఈ క్యూలో మొదటి ప్లేసులోనే ఉన్న అజీవన్ సదాశివం మాత్రం ఎన్ని రోజులు అలా ఉండాలో తెలియక గందరగోళంలో ఉన్నారు.
''ఇప్పటికే రెండు రోజులుగా ఈ క్యూలో ఉన్నాను'' అని ఓపిగ్గా చెప్పారు సదాశివం. శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక పెట్రోల్ బంక్ బయట ఆయన లైన్లో ఉన్నారు.
టాక్సీ డ్రైవరుగా పనిచేసే సదాశివంకు పెట్రోలు దొరక్కపోతే బతుకు బండి నడవదు. కానీ, శ్రీలంకలో ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. కొత్తగా ఆ దేశానికి చమురు దిగుమతి కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక మహిళ అయితే యుక్రెయిన్‌పై దాడి చేసేవారు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం అన్నారు.
యుక్రెయిన్‌పై పుతిన్ "క్రేజీ, మాచో (మగతనం)" దాడి "పురుషహంకారానికి సరైన ఉదాహరణ" అని జాన్సన్ వ్యాఖ్యానించారు.
అయితే, పుతిన్‌ను బహిరంగంగా చిన్నబుచ్చడం "తమ ఉద్దేశం కాదని" బ్రిటన్ పార్లమెంటు వివరణ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
జీ-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన తరువాత జాన్సన్ జర్మన్ మీడియా ZDFతో మాట్లాడారు.
జెండర్ సమానత్వం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, "మరింత మంది మహిళలు అధికారంలోకి రావాలని" అన్నారు.
"పుతిన్ ఒక మహిళ అయితే.. ఆయన కాదు, కానీ ఒకవేళ అయితే యుక్రెయిన్‌పై ఈ వెర్రి, మగతనపు ప్రదర్శన లాంటి యుద్ధాన్ని ప్రారంభించేవారు కాదు. ఇంత హిసకు పాల్పడేవారు కాదు. పురుషహంకారానికి సరైన ఉదాహరణ పుతిన్ యుక్రెయిన్‌లో చేస్తున్నదే" అంటూ జాన్సన్ వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలపై పుతిన్ స్పందిస్తూ, బ్రిటన్ మహిళా ప్రధానమంత్రే ఫాక్‌లాండ్ దీవుల్లో సైనిక చర్య చేపట్టేందుకు ఆదేశాలిచ్చారని అన్నారు.
"బ్రిటన్ ఫాక్‌లాండ్ దీవుల్లో సైనిక చర్య చేపట్టినప్పుడు, మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. ఫాక్‌లాండ్స్‌పై బ్రిటన్ సైనిక చర్య సామ్రాజ్యవాదానికి సంకేతం" అని పుతిన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విక్రయం చుట్టూ ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. తాజాగా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయంపై స్టే విధించింది.
బుక్ మై షో తరుపున ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ సంస్థ హైకోర్టుకు తన వాదనలు వినిపించింది.
శుక్రవారం తుది తీర్పు వెలువడుతుందని అంతా ఆశించారు. అయితే హైకోర్టు మాత్రం ఈ కేసులో స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. చివరకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన విధానంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది.
ఇక, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా నిబంధనలు ఖరారు చేసింది.
ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే తక్కువ సర్వీస్ ఛార్జ్‌తో ప్రేక్షకులకు మేలు చేసేలా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకానికి అంతా సిద్ధమయ్యిందని ఇటీవల ఏపీ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ప్రకటించారు. హైకోర్టు నుంచి అడ్డంకులన్నీ తొలగిపోతాయని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బుక్ మై షో తరుపున న్యాయవాదులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమ వ్యాపారాలకు ఆటంకం కలిగించే రీతిలో వ్యవహరిస్తోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దాంతో, ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే విధించింది.

ఫొటో సోర్స్, TWITTER @NUPURSHARMABJP
సుప్రీంకోర్టులో నూపుర్ శర్మ కేసు విచారణ నేడు ప్రారంభమైంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఈ విచారణ జరిపింది.
ఆమె నోటి దురుసుతనం వల్ల దేశం మొత్తం అట్టుడికిపోయిందని కోర్టు ఆమెను మందలించింది. ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనకు ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని అభిప్రాయపడింది.
న్యాయపరిశీలనలో ఉన్న అంశంపై టీవీ ఛానళ్లు ఎందుకు చర్చలు పెట్టాయని, అజెండాను ప్రచారం చేయడానికి తప్ప దీనివల్ల ప్రయోజనమేమిటని కోర్టు ప్రశ్నించింది.
నూపుర్ శర్మ వ్యాఖ్యలు "కలత పెట్టే విధంగా ఉన్నాయని" చెబుతూ, అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు నిలదీసింది.
అయితే, నూపుర్ శర్మ తన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ కోర్టుకు చెప్పారు.
కోర్టు లాయవ వాదన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
"శర్మ టీవీ మీడియా ద్వారానే దేశానికి క్షమాపణ చెప్పి ఉండాల్సిందని" వ్యాఖ్యానించింది.
"ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవడంలో జాప్యం చేశారని, అది కూడా 'మనోభావాలు గాయపడితే' అనే కండిషన్ పెట్టారని" కోర్టు వ్యాఖ్యానించింది.
నూపుర్ శర్మ వ్యాఖ్యానించిన తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
"మీరు ఒక పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి లైసెన్స్ రాదు" అంటూ చీవాట్లు పెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహమ్మద్ ప్రవక్త గురించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ దర్యాప్తు నిమిత్తం దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సస్పెండ్ అయిన బీజేపీ నేత నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని శర్మ చెప్పారు.
"నేను ఏ విధమైన దర్యాప్తు నుంచి పారిపోదలుచుకోలేదు. నాపై నమోదైన కేసులన్నింటినీ కలిపి ఒకే చోట విచారణ జరపాలని కోర్టును కోరుతున్నాను" అని శర్మ పేర్కొన్నారు.
అయితే, కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.

అస్సాంలో వరదల ధాటికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి.
వరదలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా ఇప్పటివరకు 150 మందికి పైగా మృతి చెందారు.
భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని, బాధిత ప్రాంతాలకు చేరుకోవడానికి కష్టంగా ఉందని, ఇంత ఘోరమైన వరదలను ఇప్పటివరకు చూడలేదని రెస్క్యూ బృందాలు బీబీసీతో చెప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జూన్ 28న జరిగిన కన్నయ్యలాల్ హత్య ఉదంతం నేపథ్యంలో, ఉదయ్‌పూర్ రేంజ్ ఐజీ హింగ్లాజ్‌దాన్, జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్‌లను గురువారం అర్థరాత్రి బదిలీ చేశారు.
ఉదయపూర్ కొత్త ఎస్పీగా అజ్మీర్ ఎస్పీ వికాస్ కుమార్, హింగ్లాజ్ స్థానంలో రేంజ్ ఐజీ ప్రఫుల్ కుమార్ నియమితులయ్యారు.
అంతకుముందు రోజు, కన్నయ్యలాల్ బంధువులను కలిసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా సీనియర్ అధికారులు ఉదయపూర్ చేరుకున్నారు.
రాష్ట్రంలోని 32 మంది ఐపీఎస్ అధికారులను రాత్రికి రాతే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయపూర్ సహా 10 జిల్లాల ఎస్పీలను కూడా తొలగించారు.
ఇటీవలే రాష్ట్రంలో శాంతిభద్రతలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తరువాత పెద్ద ఎత్తుల పోలీసు అధికారుల బదిలీలు ఉంటాయని అందరూ భావించారు.
కన్నయ్యలాల్ హత్య కేసు తరువాత, ధాన్మండి పోలీస్ స్టేషన్ హెడ్, ఒక ఏఎస్ఐ సస్పెండ్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. తన జాతీయ రికార్డును తానే బద్దలుగొట్టాడు.
గురువారం స్టాక్‌హోం (స్వీడన్)లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్ త్రోలో 89.94 మీటర్ల దూరం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో, సరి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. తన వ్యక్తిగత స్కోరును అధిగమించాడు.
డైమండ్ లీగ్‌లో ఆడడం చాలా ఆనందంగా ఉందని, తన తదుపరి లక్ష్యం యూజీన్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇది జూలై 15 నుండి జూలై 24 వరకు జరుగుతుంది
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది