రోజూ 2 గంటలపాటు ఒంటి కాలితో కుంటుతూ స్కూలుకు వెళ్తున్న బాలిక

వీడియో క్యాప్షన్, బాగా చదివి డాక్టర్ కావాలనుకుంటోన్న ప్రియాంశు కుమారి

ఈ అమ్మాయి ఒంటి కాలుతో కుంటుతూ రోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్తుంది.

ఈమె పేరు ప్రియాంశు కుమారి. ఈమెది బిహార్‌ సివాన్‌ జిల్లాలోని బంధు శ్రీరామ్ గ్రామం.

ప్రియాంశు పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు ఒక కాలు సరిగా లేదు. కానీ ఎలాగైనా బాగా చదువుకుని డాక్టర్ కావాలనుకుంటున్నట్లు ఈ అమ్మాయి చెబుతోంది.

ప్రియాంశు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తాను ఒంటి కాలిపై బ్యాలెన్స్ చేస్తూ రోజూ వెళ్తానని, ఆ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల మరింత కష్టంగా ఉంటోందని చెప్పింది.

నడవడానికి వీలుగా తనకు ఒక కృత్రిమ కాలు పెట్టించాలని విజ్ఞప్తి చేసింది.

తన కూతురు చదువుకోడానికి, ఆమె కలలు నెరవేర్చుకోడానికి ప్రభుత్వం సాయం చేయాలని బాలిక తల్లి రీనా దేవి విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)