పాకిస్తాన్‌లో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

వీడియో క్యాప్షన్, దేశం దివాలా తీయకుండా ఉండాలంటే ధరలు పెంచడం తప్పనిసరైందన్న ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్

పాకిస్తాన్‌లో పెట్రోల్-డీజిల్ ధరలు మండిపోతున్నాయి.

లీటరు పెట్రోల్ ధర 209.86 రూపాయలు కాగా, డీజిల్ ధర 204.15 రూపాయలు. దీంతో పాటు కరెంటు చార్జీలను కూడా యూనిట్‌కు దాదాపు 8 రూపాయలు పెంచింది ఆ దేశ విద్యుత్ సంస్థ.

దేశం దివాలా తీయకుండా ఉండాలంటే ధరలు పెంచడం తప్పనిసరైందని ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ అన్నారు.

బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ ఇస్లామాబాద్‌లో కొందరితో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)