రష్యా- యుక్రెయిన్ సంక్షోభంలో భారత్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతోందా?
యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ విషయంలో భారత్ వైఖరి రష్యాకు వ్యతిరేకంగా లేదు. భారతదేశం తన అధికారిక ప్రకటనలలో రష్యాను ఖండించలేదు. మరోవైపు యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని నొక్కిచెప్పలేదు.
అయితే, ఇది భారత్‌లో కొత్త ట్రెండ్ కాదు. కొన్ని ఇతర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు రష్యా విషయంలో ఇదే వైఖరిని అనుసరించాయి.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయి. భారత్ ఏదో ఒక పక్షం తీసుకోకుండా ఉండటం అంత సులభం కాదు.
భారత్, అమెరికా ప్రధాన రక్షణ భాగస్వాములు. అయితే రష్యా విషయంలో రెండు దేశాలు కలిసి ఉన్నాయా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ''ఈ రోజు భారత్‌తో అమెరికా మాట్లాడనుంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఏకాభిప్రాయం దొరకలేదు''అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
