You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2021 - 2022: కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
కాలిఫోర్నియాలో జన్మించిన ఇద్దరు కవలలు ఒక అసాధారణమైన రికార్డు సాధించారు. వారిద్దరి పుట్టిన రోజులు వేర్వేరు సంవత్సరాలలో వస్తాయి.
ఆల్ఫ్రెడో ఆంటోనియో ట్రుజిల్లో డిసెంబర్ 31న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు పుట్టాడు. తన సోదరి ఐలిన్ యోలాండా ట్రుజిల్లో కేవలం 15 నిమిషాల తరువాత, తేదీ మారిపోయాక పుట్టింది.
ఆల్ఫ్రెడో 2021 డిసెంబర్ 31న పుడితే, ఐలిన్ 2022 జనవరి, 1న పుట్టింది.
తన కవల పిల్లలు వేరు వేరు తేదీల్లో పుట్టడం "క్రేజీగా" ఉందని వారి తల్లి, ఫాతిమా మాడ్రిగల్ చెప్పారు.
అర్థరాత్రి దాటిన తరువాత పుట్టిన ఐలిన్ కొత్త సంవత్సరంలో ఆ ఆస్పత్రిలో పుట్టిన మొదటి బిడ్డ కావడం "ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని" కలిగిస్తోందని ఆమె అన్నారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, అమెరికాలో సంవత్సరానికి 1,20,000 సార్లు కవల జననాలు సంభవిస్తాయి. మొత్తం జననాలలో ఇది మూడు శాతం.
వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టే సంభావ్యత రెండు మిలియన్లలో ఒకటి అని ఈ కవలలు పుట్టిన ఆస్పత్రి నేటివిడాడ్ మెడికల్ సెంటర్ అంచనా వేసింది.
ఇలా వేర్వేరు తేదీల్లో పుట్టిన పిల్లలను చూడడం "తన కెరీర్‌లో మరపురాని సంఘటన" అని ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్ అభివర్ణించారు.
"ఈ చిన్నారులను 2021, 2022లలో సురక్షితంగా ఈ భూమి పైకి తీసుకురావడంలో పాలుపంచుకున్నందుకు ఆనందంగా ఉంది" అని డాక్టర్ అనా అబ్రిల్ అరియాస్ అన్నారు.
పుట్టినప్పుడు మొదటి బిడ్డ ఆల్ఫ్రెడో 2.8 కిలోలు, అతని సోదరి ఐలిన్ 2.4 కిలోలు ఉన్నారు. ఈ చిన్నారులకు ముగ్గురు అన్నయ్యలు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- అవిభక్త కవలలకు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం
- తల్లిపాలు బిడ్డకు ఎప్పుడు పట్టాలి... అపోహలు, వాస్తవాలు
- వీర్యంలో శుక్ర కణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) పెంచుకోవడం ఎలా? డాక్టర్ సమరం ఇస్తున్న 9 సూచనలు..
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- మీకు గురక రాకుండా చేసే 5 పద్ధతులు
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- దేశంలో కండోమ్‌ల వాడకం ఎందుకు పెరిగింది? - జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)