సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

వీడియో క్యాప్షన్, సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

ఖగోళ చరిత్రలో తొలిసారిగా సూర్యుడి వెలుపలి కక్షలోకి అంతరిక్ష నౌక ప్రవేశించింది.

సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని కరోనా అంటారు. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక కరోనాలోంచి కొద్దిసేపు ప్రయాణించింది.

ఇది ఏప్రిల్‌లో జరిగింది. కానీ, డాటాను విశ్లేషించి ఇప్పుడు నిర్థరించారు.

సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన వేడి, రేడియేషన్లను తట్టుకుని పార్కర్ సూర్యుడి గమనం, పనితీరు గురించి మరిన్ని కొత్త కోణాలను సేకరించింది.

"చంద్రుడి మీద కాలు మోపడం ద్వారా అది ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడానికి వీలు పడింది. సూర్యుడి సమీపానికి వెళ్లడం ద్వారా మనకు దగ్గరగా ఉన్న అతి పెద్ద నక్షత్రం సౌరవ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవచ్చు. ఈ క్లిష్ట సమాచారాన్ని సేకరించడం మానవ పురోగతిలో అతి పెద్ద మలుపు" అని నాసా హీలియోఫిజిక్స్ సైన్స్ విభాగం డైరెక్టర్ నికోలా ఫాక్స్ తెలిపారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)