You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాతావరణ మార్పులు: అస్సాం టీ రంగు, రుచి మారిపోతోంది..
‘‘పోషకాలు, రంగు, రుచి, చిక్కదనం, వాసన వంటివి టీలో సరైన మోతాదులో ఉండాలి. కానీ నేడు తేయాకులో ఇవన్నీ ఉండాల్సిన స్థాయిలో ఉండటం లేదు. ఇదే ప్రధానమైన తేడా. గతంలో ఉండే పరిమళం, సువాసన ఇప్పుడు బాగా తగ్గిపోయాయి’’ అంటున్నారు జోర్హాట్‌లోని టాక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టీ టేస్టర్ ఆర్‌సీ గొగొయ్.
కానీ కొన్నేళ్లుగా అస్సాంలో ఎండలు పెరగడంతోపాటు వానలు తగ్గిపోతున్నాయి.
ఈ ఏడాది ఒక్క నెలలో కూడా సాధారణ వర్షపాతం లేదా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.
సాధారణంగా అస్సాంలో జనవరి నుంచి సెప్టెంబరు మధ్య సుమారు 1,857 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇప్పుడు 1,188 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతోంది. ఇది 36శాతం తక్కువ.
అలాగే 28.9 డిగ్రీలుగా ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలు పెరిగి 30.3 డిగ్రీలుగా నమోదవుతోంది.
అస్సాంలో పర్యావరణమార్పుల ప్రభావం టీ తోటల మీద బాగా కనిపిస్తోంది. తేయాకు ఉత్పత్తి మూడింట ఒకవంతు తగ్గొచ్చన్నది అంచనా.
సాగు నీటిని అందించడం ద్వారా సమస్యను కొంతమేరకు ఎదుర్కొవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఇది మాత్రమే సరిపోదని ఇంకొందరు అంటున్నారు.
ఇక్కడ వందల మంది మహిళలు అస్సాం టీ తోటల్లో పని చేస్తుంటారు. పర్యావరణ మార్పులు వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెరుగుతున్న వేడి, తగ్గుతున్న వానల వల్ల తేయాకు ఉత్పత్తి తగ్గి తమ బతుకులు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు. రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి మధ్యే వీళ్లు నిత్యం జీవితాలను గడపాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఒకప్పుడు కేసీఆర్ కుడిభుజం.. ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం..
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
- COP26: 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని భారత్ వాగ్దానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)