You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంగారకుడిపై చైనా జూరోంగ్ రోవర్ తీసుకున్న సెల్ఫీ ఫోటోలివే...
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
అంగారక గ్రహంపై తీసిన కొత్త ఫోటోలను చైనాకు చెందిన జూరోంగ్ రోవర్ భూమిపైకి పంపింది.
ఆరు చక్రాలున్న జూరోంగ్ గత మే నెలలో మార్స్‌పై కాలుమోపింది. తాజాగా ఈ రోవర్ పంపిన ఫోటోల్లో ఒక సెల్ఫీ కూడా ఉంది. వైర్‌లెస్ కెమేరాను నేలపై పెట్టి కొంచెం వెనక్కి జరిగి జూరోంగ్ ఈ ఫోటో తీసుకుంది.
జూరోంగ్‌కు కుడివైపు ఓ ప్లాట్‌ఫామ్ కనిపిస్తోంది. రోవర్ సురక్షితంగా ఇక్కడ కాలుమోపడంలో ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడింది.
ఇటు జూరోంగ్, అటు ప్లాట్‌ఫామ్ రెండింటిపైనా చైనా జెండాలు కనిపిస్తున్నాయి.
రెండో ఫోటోను జూరోంగ్ తీసింది. దీనిలో ప్లాట్‌ఫామ్ మాత్రమే కనిపిస్తోంది.
అంగారక ఉపరితలంపైకి జూరోంగ్ దిగినప్పుడు అక్కడి దూళి ఎగిరిన జాడలు దీనిలో మనం చూడొచ్చు.
మూడో ఫోటోలో అంగారక ఉత్తరార్ధ గోళంలోని ‘‘ఉటోపియా ప్లానిషియా’’గా పిలిచే సువిశాల ప్రాంతం కనిపిస్తోంది.
అంగారక యాత్ర విజయవంతం కావడంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి చైనా అంతరిక్ష సంస్థ ఈ ఫోటోలను విడుదల చేసింది.
అంగారకుడిపై జూరోంగ్ 90 రోజులకుపైగా గడుపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
2000ల్లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన స్పిరిట్, ఆపర్చునిటీ రోవర్లలానే జూరోంగ్ కూడా కనిపిస్తోంది.
జూరోంగ్ బరువు దాదాపు 240 కేజీలు. దీనికి పొడవుగా యాంటెనా లాంటి నిర్మాణం ఉంది. దీనిపై కెమెరా ఏర్పాటుచేశారు. రోవర్ ముందుకు కదలడంలోనూ ఇది తోడ్పడుతుంది. అంగారకుడిపై రాళ్లు, వాతావరణం, పర్యావరణాలను పరిశోధించేందుకు రోవర్‌లో ఐదు ప్రత్యేక పరికరాలు ఉన్నాయి.
అంగారకుడి రాళ్ల నిర్మాణాన్ని పరిశోధించేందుకు అమెరికా రోవర్లు క్యూరియోసిటీ, పెర్సీవరెన్స్‌లలానే జూరోంగ్‌లోనూ ఓ లేజర్ పరికరం ఉంది. మంచు లేదా నీటిని గుర్తించేందుకు రాడార్ కూడా ఉంది.
జూరోంగ్‌కు కక్ష్య నుంచి తీసిన ఓ కలర్ ఫోటోను అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ గురువారం విడుదల చేసింది. హైరైస్ కెమెరాతో ఈ ఫోటో తీశారు. ఈ కెమెరాను నాసాకు చెందిన రికానిసెన్స్ ఆర్బిరట్‌కు అమర్చారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం': కె.నారాయణ
- హోం థియేటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవి ఉంటే చాలు...
- స్టార్ హీరోలు, హీరోయిన్ల మహిళా బాడీగార్డులు... ‘‘పరిస్థితి ఇలాగే ఉంటే ఆకలితో చనిపోతాం’’
- కరోనావైరస్: సినీ కార్మికులు, సాధారణ ప్రజలకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల సహాయం
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
- రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి 25 ఏళ్లు ఎందుకు పట్టింది?
- అభిషేక్ బచ్చన్: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...
- మియన్మార్: ప్రాణభయంతో సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్న ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)