You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ అభిశంసన: వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేందుకు డెమొక్రాట్ల ప్రయత్నాలు
డోనల్డ్ ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రవేశపెడుతున్న ఆర్టికల్‌పై మంగళవారం ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగే అవకాశముందని సీనియర్ డెమొక్రాట్ నాయకుడు తెలిపారు.
నిరసనకారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన ఘటనకు సంబంధించి అల్లర్లు రెచ్చగొట్టారనే ఆరోపణలపై ట్రంప్‌ను అభిశంసించాలని ప్రతినిధుల సభలో ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే.
ట్రంప్‌పై ఈ వారంలోనే చర్యలు తీసుకునే అవకాశముందని ప్రతినిధుల సభ విప్ జేమ్స్ క్లైబర్న్.. సీఎన్ఎన్తో చెప్పారు.
అయితే, ఈ అభిశంసనకు సంబంధించి ఆర్టికల్స్‌ను బైడెన్ పాలన 100 రోజులు పూర్తయ్యే వరకు సెనేట్‌కు పంపకూడదని డెమొక్రటిక్ పార్టీ భావిస్తోంది.
‘‘అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు ఒక వంద రోజుల సమయం ఇవ్వాలి. ఆయన తన అజెండాను ముందు సిద్ధం చేసుకోవాలి’’అని క్లైబర్న్ వివరించారు.
క్యాబినెట్ మంత్రుల నియామకానికి ఆమోదముద్ర, కరోనావైరస్‌పై పోరాటం సహా కీలక విధానాల రూపకల్పన తదితర అంశాలకు ఈ సమయం ఉపయోగపడుతుంది. ఒకవేళ అభిశంసన ఆర్టికల్స్ అప్పటికే సెనేట్‌కు వచ్చినా.. వీటిని పెండింగ్‌లో పెడతారు.
స్పందించని ట్రంప్
ట్విటర్ సహా కొన్ని సోషల్ మీడియా సైట్లు శుక్రవారం నిషేధం విధించిన తర్వాత ట్రంప్ ఎలాంటి ప్రకటనలూ చేయలేదు.
అయితే, మంగళవారం టెక్సాస్‌లో ట్రంప్ పర్యటిస్తారని వైట్‌హౌస్ ఆదివారం తెలిపింది. మెక్సికోలోని సరిహద్దుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించింది.
అమెరికా కాంగ్రెస్ పరిసరాల్లో గత బుధవారం చోటుచేసుకున్న అల్లర్లలో ఐదుగురు మరణించారు. వీటిని ట్రంపే రెచ్చగొట్టారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌పై ఆరోపణలు చేస్తున్న రిపబ్లికన్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
అయితే, ట్రంప్‌కు వ్యతిరేకంగా సెనేట్‌లో ఓటు వేస్తామని ఇప్పటివరకు ఏ రిపబ్లికన్ సెనేటరూ చెప్పలేదు.
పెరుగుతున్న వ్యతిరేకత
మరోవైపు ట్రంప్ రాజీనామా చేయాలంటూ రిపబ్లికన్ సెనేటర్ ప్యాట్ టూమే ఆదివారం డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఇలా డిమాండ్ చేసిన రిపబ్లికన్ సెనేటర్లలో ఆయన రెండోవారు.
‘‘నాకు తెలిసినంత వరకు మన దేశానికి ఇదే మంచిది. వీలైనంత త్వరగా ఆయన శ్వేతసౌధాన్ని విడిచిపెట్టి పోవాలి’’అని ఎన్‌బీసీ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో టూమే వ్యాఖ్యానించారు.
‘‘ఇది జరిగే అవకాశంలేదని నాకు తెలుసు. కానీ ఇదే దేశానికి చాలా మంచిది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ రాజీనామా చేయాలంటూ కోరిన మొదట సెనేటర్ లియా ముక్రోవ్‌స్కీ(అలస్కా). ట్రంప్ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపితే... తను కూడా అభిశంసనకు అనుకూలంగా ఓటు వేసే అవకాశముందని రిపబ్లికన్ సెనేటర్ బెన్ సెస్సే తెలిపారు.
మరోవైపు ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారిలో ట్రంప్ అత్యంత చెడ్డవారని మాజీ రిపబ్లికన్ గవర్నర్ ఆర్నాల్డ్ స్వార్జెనెగ్గర్ ఆదివారం సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు.
క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులను విచారిస్తున్న అధికారులను వర్జీనియా, వాషింగ్టన్‌లోని పోలీసు విభాగాలు సెలవులపై పంపించాయి. ఆ అధికారులు సెలవుల్లో ఉన్నప్పటికీ విచారణకు హాజరు అవుతున్నారని చెప్పాయి.
రాజకీయ లక్ష్యాల కోసమే..
ట్రంప్‌ను అభిశంసించేందుకు చేసిన ప్రయత్నాలు రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారని శ్వేతసౌధం వ్యాఖ్యానించింది. దేశ ప్రజల మధ్య ఈ ప్రయత్నాలు మరింత చిచ్చు పెడతాయని ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ అభిశంసన తీర్మానానికి ఆమోదం పడితే.. రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు.
ఇది జరగాలంటే అభిశంసనకు సంబంధించిన ఆరోపణలు మొదట ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టి, ఓటింగ్ జరిపి ఆమోదించాలి.
‘‘మంగళవారం లేదా బుధవారంలోగా చర్యలు తీసుకునే అవకాశముంది. ఏదైనా ఈ వారంలోనే జరుగుతుంది’’అని ప్రతినిధుల సభ విప్ క్లైబర్న్ సీఎన్ఎన్తో చెప్పారు.
ఆ తర్వాత ఈ అభియోగాలను సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా రెండింట మూడొంతుల మెజారిటీతో ఈ ఆర్టికల్స్‌కు ఆమోదం పడితే... ట్రంప్ అభిశంసనకు గురవుతారు. అదే సమయంలో మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునే అధికారం సెనేట్‌కు ఉంటుంది.
అయితే, పది రోజుల్లో ట్రంప్ శ్వేతసౌధం నుంచి బయటకు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. అభిశంసన చర్యలు పూర్తికాకపోవచ్చని క్లైబర్న్ వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 25ను అమలోకి తెస్తారా?
మరోవైపు డెమొక్రాట్లు కూడా సెనేట్‌కు అభిశంసన ఆర్టికల్స్‌ను ఆలస్యంగా పంపాలని భావిస్తున్నారు. అదేసమయంలో ఆర్టికల్ 25ను అమలులోకి తీసుకురావాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను వారు కోరుతున్నారు. ఈ ఆర్టికల్‌ను అమలు చేస్తే.. ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవచ్చు.
అభిశంసన ప్రక్రియకు ముందుగా, అంటే తక్షణమే ట్రంప్‌ను అధికారం నుంచి తొలగించే అధికారాలు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు అప్పగించే తీర్మానంపై ఈ వారం ఓటింగ్ జరిగే అవకాశముందని డెమొక్రటిక్ నాయకురాలు, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు.
అయితే, ఆ వార్తలకు మైక్ పెన్స్ కాస్త దూరంగా ఉంటున్నారు. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాబోతున్నట్లు పెన్స్ తెలిపారు. ట్రంప్‌ను తొలగించే ఆర్టికల్స్‌పై చర్యలు తీసుకునే సంకేతాలు ఆయన ఏమీ ఇవ్వలేదు.
బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాబోనని ఇప్పటికే ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓటమితోపాటు అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ... ఎన్నికల్లో మోసం జరిగిందని ఇప్పటికీ ఆయన ఆరోపిస్తున్నారు.
అభిశంసనపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అర్హత ట్రంప్‌కు లేదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్: కొత్త ప్రైవసీ నిబంధనలతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా? అసలు ఆ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- సునీల్ గావస్కర్ సర్ బ్రాడ్‌మన్ రికార్డును ఎలా బ్రేక్ చేశారు... అప్పుడు అసలేం జరిగింది?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)