You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ సరిహద్దులో తుపాకితో కాల్చుకున్న సిక్కు మత బోధకుడు మృతి
దిల్లీ సరిహద్దుల్లో బుధవారం సాయంత్రం తుపాకీతో కాల్చుకున్నారని చెబుతున్న సిక్కు మత బోధకుడు 65 ఏళ్ల రామ్ సింగ్ సింగ్రా మరణించారు.
రామ్ సింగ్‌ది హరియాణాలోని కర్నాల్ సమీపంలోని ఓ గ్రామం. మీడియాలో చూసి తమకు సమాచారం తెలిసిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
''అధికారికంగా మాకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియా ద్వారా తెలిసింది'' అని ఆయన చెప్పారు.
''ఆయన్ను కర్నాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన్ను తరలించినట్లు తెలిసింది. ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
రామ్ సింగ్ తనను తాను కాల్చుకున్నారని ఆయన సహచరుడు జోగా సింగ్ 'బీబీసీ పంజాబీ' విలేకరి ఖుషాల్ లాలికి చెప్పారు.
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా సింగ్ సరిహద్దులో నిరసన చేస్తున్న సంత్ రాంసింగ్ జీ మరణవార్త విస్మయానికి గురి చేసిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- 9/11 దాడులకు 18 ఏళ్లు: తీవ్రవాదంపై పోరాటంలో అమెరికా విఫలం - అభిప్రాయం
- డెబిట్ కార్డులు, ఏటీఎంలు త్వరలో కనిపించకుండా పోతాయా...
- పాకిస్తాన్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)