You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోదీ పేరుతో అమెరికాలోని భారతీయుల ఓట్లకు ట్రంప్ గాలం వేస్తున్నారా?
భారత సంతతి ఓట్లను ఆకట్టుకోడానికి ట్రంప్ ఎలక్షన్ టీమ్ 107 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలోని కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి.
ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో ఆయన చేసిన ప్రసంగం, అలాగే మోదీ ప్రసంగాలను కూడా ఇందులో చేర్చారు. దీనికి' ఫోర్ మోర్ ఇయర్స్' అనే క్యాప్షన్ పెట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్‌లు ప్రసంగించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ పర్యటనలో ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్‌తోపాటు, ప్రభుత్వంలోని అనేకమంది ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ట్రంప్ విక్టరీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కింబర్లీ గియుల్‌ఫోయిల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
"అమెరికాకు భారత్‌తో గొప్ప అనుబంధం ఉంది. మా ప్రచారానికి భారతీయ అమెరికన్ల నుండి మద్దతు లభిస్తోంది" అని ఆమె ట్వీట్ చేశారు.
ట్రంప్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన ఆయన కుమారుడు డోనల్డ్ ట్రంప్ జూనియర్ కూడా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయింది. కొన్నిగంటల్లో దాదాపు 70వేల వ్యూస్‌ను సాధించింది.
హ్యూస్టన్ నగరంలోని ఎన్‌ఆర్జీ స్టేడియం ఫుటేజ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఇందులో మోదీ, ట్రంప్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తూ కనిపిస్తారు. ఈ వీడియో ఫుటేజ్ గత ఏడాది మోదీ అమెరికా పర్యటన నాటిది.
అప్పటి హ్యూస్టన్ సభకు యాభై వేలమంది అమెరికన్ ఇండియన్‌లు తరలివచ్చారు. మోదీ ప్రసంగం వినడానికి వారంతా ఆసక్తి చూపించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: ‘భారత్ మూడు కరోనావైరస్ వ్యాక్సీన్లను తయారు చేస్తోంది’
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)