You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్... ఎలా వచ్చిందంటే...
అమెరికాలో ఓ పులికి కరోనావైరస్ సోకింది. న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ జూలో ఉంటున్న నాలుగేళ్ల మలయన్ జాతి ఆడపులికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో పాజిటివ్ వచ్చిందని నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ ల్యాబొరేటరీ వెల్లడించింది.
ఈ పులి పేరు నదియా.
నదియా తోబుట్టువు అజుల్‌తో పాటు మరో రెండు అమూర్ పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలు పొడి దగ్గు సమస్యతో ఉన్నాయని, ఇవన్నీ పూర్తిగా కోలుకుంటాయని భావిస్తున్నామని తెలిపింది.
వీటి ఆలనాపాలనా చూసే ఓ జూ కీపర్ నుంచి వీటికి ఈ వైరస్ అంటుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.
‘‘ముందు జాగ్రత్తగా నదియాకు పరీక్షలు చేశాం. ఈ విషయంలో మాకు కొత్త విషయాలేవి తెలిసినా, బయటకు వెల్లడిస్తాం. ఈ వైరస్ గురించి అవగాహన పెంచుకునేంచేందుకు ప్రపంచం చేస్తున్న ప్రయత్నాలకు సాయపడతాం’’ అని జూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అనారోగ్యంతో ఉన్న పులులు, సింహాలకు ఆకలి కాస్త తగ్గిందని జూ తెలిపింది. అయితే, చురుగ్గానే ఉంటున్నాయని, జూ కీపర్స్‌తో బాగానే స్పందిస్తున్నాయని పేర్కొంది.
కొత్త ఇన్ఫెక్షన్లకు వివిధ జంతు జాతుల్లో స్పందనలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉండటంతో పులులు, సింహాల్లో ఈ వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలియదని జూ వ్యాఖ్యానించింది. తాము మాత్రం ఈ జంతువులను నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపింది.
‘‘వాటిని చూసుకునే ఓ వ్యక్తి నుంచి వైరస్ వాటికి వ్యాపించింది. అప్పటికి ఆ వ్యక్తికి వైరస్ లక్షణాలు లేవు’’ అని వివరించింది.
జూలోని మిగతా పులుల్లో అనారోగ్య లక్షణాలు ఏమీ కనిపించడం లేదని జూ పేర్కొంది.
వైరస్ లక్షణాలు ఉన్న జంతువులన్నింటినీ జూలో ఉన్న టైగర్ మౌంటెయిన్ ఏరియాలో విడిగా పెట్టారు. మార్చి 16 నుంచి బ్రాంక్స్ జూ సహా న్యూయార్క్‌లోని వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ నడిపే నాలుగు జూలలోకి సందర్శకులను అనుమతించడం లేదు.
అమెరికాలో పెంపుడు జంతువులతో సహా జంతువుల నుంచి మనుషులకు కోవిడ్-19 వచ్చినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని జూ తెలిపింది.
కోతుల్లాంటి జీవాలకు ఈ వైరస్ పెద్ద ముప్పుగా పరిణమించవచ్చని వణ్యప్రాణి సంరక్షక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గొరిల్లాలు, చింపాంజీలు, ఒరాంగుటాన్లకు ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం
- కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: 'లాక్డౌన్లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'
- కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)