You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాక్ నిరసనలు: బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
ఇరాక్ వ్యాప్తంగా అక్టోబరు నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు వీటిలో పాల్గొంటున్నారు. పితృస్వామ్య దేశమైన ఇరాక్‌లో, ఈ ఆందోళనల్లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తుండటం ఒక అసాధారణ పరిణామం.
రాజధాని బాగ్దాద్ నగరవ్యాప్తంగా గోడలపై 'మ్యూరల్' పెయింటింగ్‌లు వెలిశాయి. ఆందోళనలకు బాగ్దాద్‌లోని తాహిర్ స్క్వేర్ కేంద్ర బిందువుగా ఉంది. సృజనాత్మకతతో కూడిన నిరసనలకు ఇది వేదికైంది.
ఇరాక్ మహిళల శక్తి, స్ఫూర్తిని చాటుతూ వేసిన మ్యూరల్‌లు, ఆందోళనలకు ప్రభావవంతమైన దృశ్యరూపాన్ని ఇస్తున్నాయి.
మ్యూరల్ పెయింటింగ్ ఎక్కువగా మహిళలు వేస్తుంటారు.
తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే విషయంలో ఇరాక్ మహిళలు క్రియాశీల పాత్ర పోషించడం పెరుగుతోంది.
నిరసనలు, మ్యూరల్ పెయింటింగ్‌లు మహిళలు కలసికట్టుగా పోరాడేందుకు దోహదం చేస్తున్నాయి. తమ చరిత్రను తామే తిరగరాసుకొనేందుకు ఊతమిస్తున్నాయి.
ఇరాక్‌లో భద్రతా బలగాల చేతిలో 400 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా తల్లిదండ్రులు, భర్తలు వద్దని వారిస్తున్నా మహిళలు వెనకడుగు వేయకుండా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కొన్నిసార్లు రహస్యంగా నిరసనల్లో పాలుపంచుకొంటున్నారు.
గతంలో రాజకీయ ఉద్యమాల్లో మహిళలను విస్మరించేవారు. ఈసారి రాజకీయ అజెండా ఏదీ లేకపోవడంతో వారు ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇరాక్ సమాజంలో మగవారు, ఆడవారు కలసి నిరసనల్లో పాల్గొనడం అరుదు. ఇప్పుడు ఒక ఉమ్మడి లక్ష్యం కోసం వారు కలసి ఉద్యమంలో పాల్గొనడం ఒక ముఖ్యమైన సామాజిక పరిణామం.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: దిల్లీలోనూ ఆందోళనలు.. బస్సుల దహనం
- రొమేనియా తీరంలో 14 వేల గొర్రెలతో ప్రయాణిస్తున్న భారీ నౌక మునక
- టర్కీ బహిష్కరించిన ఐఎస్ జిహాదీల పరిస్థితి ఏమిటి... తమ దేశం వద్దంటే వారు ఎటు పోవాలి?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)