You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రోహిత్ శర్మ : టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్.. భారత్ 497/9, దక్షిణాఫ్రికా 9/2
భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా, దక్షిణాఫ్రికాతో ఒక టెస్ట్ సిరీస్‌లో 500లకు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రికార్డ్ నమోదు చేశాడు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌లో తొలి రోజు శతకం కొట్టిన అతడు.. రెండో రోజైన ఆదివారం అదే జోరును కొనసాగిస్తూ 212 పరుగులు చేశాడు.
ఈ సిరీస్‌తోనే రోహిత్ టెస్టుల్లో ఓపెనర్‌గా మారాడు. తొలి మ్యాచ్‌లో రెండు సెంచరీలు (176, 127) కొట్టి.. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండో మ్యాచ్‌లో 14 పరుగులకే ఔటైనా, మూడో మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు.
భారత జట్టు 224/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించింది.
117 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్, అజింక్య రహానే (115) ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు మొత్తంగా 267 పరుగులు జోడించారు.
జట్టు స్కోరును 300 దాటిన తర్వాత కొద్దిసేపటికే రహానే ఔటయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా వచ్చాడు.
లంచ్ విరామ సమయానికి 199 పరుగులకు చేరుకున్న రోహిత్.. విరామం తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాది ద్విశతకం పూర్తి చేసుకున్నాడు.
అయితే, ఆ తర్వాతి ఓవర్‌లోనే (88.1) రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎంగిడికి క్యాచ్ ఇచ్చాడు.
అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 370-5.
తన ఇన్నింగ్స్‌లో రోహిత్ మొత్తం 28 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
వన్డేల్లో రోహిత్ పేరిటే అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు ఉంది. పరిమిత ఓవర్లలో అతడు మూడు ద్విశతకాలు సాధించాడు.
రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాహా (24) ఎక్కువ సేపేమీ నిలబడలేదు.
జట్టు స్కోరు 417 పరుగులుండగా లిండే అతడిని బౌల్డ్ చేశాడు.
భారత్ 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
- టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- భారతదేశంలో ఇంటర్నెట్ను అత్యధికంగా వాడుతున్నదెవరు...
- శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?
- ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’
- అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.