You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు కావాలని.. బరువు 130 కేజీలు.. వారానికి ఏడు కోళ్లు తింటాడు.. ఐదు రోజులు జిమ్‌లోనే ఉంటాడు
ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు(వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్) కావాలనే కలను నిజం చేసుకునేందుకు మైకీ లేన్ ప్రతి రోజూ 8500 కాలరీలు తింటున్నాడు. వారానికి ఐదు రోజులు జిమ్‌లోనే ఉండిపోతున్నాడు.
మిడ్‌లాండ్‌లో నివసించే 35 ఏళ్ల మైకీ శిక్షణలో భాగంగా తీసుకునే డైట్‌లో వారానికి ఏడు కోళ్లు, ఆరు పిజ్జాలు కూడా ఉంటాయి.
వరల్డ్ స్ట్రాగ్స్ట్ మాన్ పోటీలో గెలిచేందుకు ఇతడు గత తొమ్మిదేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నాడు.
ఆటలకు తను పనికిరానని భావించిన మైకీ, చిన్నప్పట్నుంచే బరువులెత్తే శిక్షణ ప్రారంభించాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కు రోజూ సైకిల్‌పై వెళ్లేవాడు.
ప్రతి ఏటా క్రిస్మస్ రోజున వార్విక్‌షైర్‌లో జరిగే వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ పోటీల్లో ఏదో ఒక రోజు టైటిల్ అందుకుంటానని మైకీ చెబుతున్నాడు.
మొదట ఒక కమర్షియల్ జిమ్‌కు వెళ్లిన మైకీ.. అక్కడి ఎక్విప్‌మెంట్ కూడా సరిపోకపోవడంతో మూడేళ్ల క్రితం ఒక షెడ్ అద్దెకు తీసుకుని తన స్పెషల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు.
దానికి 'గొరిల్లా పాస్' అనే పేరు పెట్టాడు.
వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ పోటీల్లో ఐదు అట్లాస్ స్టోన్స్ కచ్చితంగా ఎత్తాలి, వాటిని కాస్త ఎత్తుగా ఉన్న ఫ్లాట్‌ఫామ్స్ మీద పెట్టాల్సి ఉంటుంది.
శిక్షణలో మైకీకి ఆయన గర్ల్ ఫ్రెండ్ నీనా సాయం చేస్తున్నారు. మేనేజర్, ఫిజియోథెరపిస్టుగా ఉండడంతోపాటు అతడికి అవసరమైన భోజనం కూడా సిద్ధం చేస్తుంటారు.
నీనా ఇంతకు ముందు స్ట్రాంగ్ ఉమెన్ పోటీల్లో కూడా పాల్గొన్నారు.
మైకీ తన 130 కిలోల బరువు మెయింటైన్ చేయడానికి పశు మాంసం, పంది మాంసం, బ్రెడ్ రోల్స్, కోల్డ్ రోస్ట్ చికెన్, కూరగాయలు, ఓట్స్ కలిపిన షేక్స్, చిప్స్ లాంటి స్నాక్స్, చాక్లెట్లు, బిస్కట్లు కూడా తింటాడు.
స్ట్రాంగెస్ట్ మెన్, ఉమెన్ పోటీల్లో పాల్గొనే మిగతా వాళ్లు కూడా మైకీ దగ్గరకు వస్తుంటారు. వారందరి మధ్య పోటీ ఉన్నప్పటికీ, కసరత్తులు ఎలా చేయాలో వారు షేర్ చేసుకుంటారు.
ఈ పోటీ కోసం కఠిన కసరత్తులు చేసే మైకీ చాలా బరువున్న మెటల్ ఫ్రేమ్స్ కూడా ఎత్తుకుని పరుగులు తీస్తుంటాడు.
మైకీ జిమ్‌లో అతడి పెంపుడు కుక్క 'మజికీన్' కూడా ఉంటుంది. అది 8 వారాల వయసులో ఉన్నప్పటి నుంచీ అతడి వెంటే నీడలా ఉంటోంది.
స్ట్రాంగ్‌మాన్ అనిపించుకోడానికి కష్టపడుతున్న మైకీని అప్పుడప్పుడు శారీరక సమస్యలు కూడా వేధిస్తుంటాయి. కీళ్లు పట్టేయడం, కండరాల నొప్పి వస్తుంటాయి.
ఇటీవల ఉటాలో జరిగిన పోటీల్లో పాల్గొన్న మైకీ 362 కిలోలు ఎత్తే కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కానీ, అర పాయింట్ తేడాతో మూడో స్థానాన్ని కోల్పోయాడు.
మైకీ ప్రస్తుతం సెప్టంబర్ 15న జరిగే 'ఎలైట్ బ్రిటిష్ చాంపియన్‌షిప్' కోసం కసరత్తులు చేస్తున్నాడు. స్ట్రాంగ్‌మాన్ కావాలని తనలాగే కలలు కనేవారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుంటాడు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపై ఆర్థిక మాంద్యం ప్రభావం: ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- నిచ్చెనలో తల ఇరుక్కుపోయి అయిదు రోజులు అలాగే ఉన్నాడు...
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)