You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించిన 10 మంది శ్రీలంక క్రికెటర్లు
శ్రీలంక క్రికెట్ జట్టులోని 10 మంది ఆటగాళ్లు.. భద్రతా కారణాలతో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించారు.
వీరిలో శ్రీలంక టీ-20 కెప్టెన్ లసిత్ మలింగ, వన్డే టీమ్ కెప్టెన్ దిముత్ కరుణరత్నె కూడా ఉన్నారు.
2009 మార్చిలో లాహోర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు శ్రీలంక టీమ్ వెళ్తున్న బస్‌పై మిలిటెంట్ దాడి జరిగింది. తర్వాత చాలా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్‌లో ఆడడానికి నిరాకరించాయి.
జట్టులోని ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్ల గురించి మాట్లాడిన శ్రీలంక క్రికెట్ బోర్డు "పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మేం ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేశాం" అని చెప్పింది.
ఆ తర్వాత పది మంది ఆటగాళ్లు పాకిస్తాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు బోర్డు చెప్పింది.
సెప్టెంబర్ 27న ప్రారంభం కావల్సిన పాకిస్తాన్ పర్యటనలో శ్రీలంక జట్టు పాక్ టీంతో మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
క్రికెట్ ఆతిథ్యం విషయంలో ఏకాకిగా మారిన పాకిస్తాన్‌కు ఈ పర్యటన చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు.
అయితే, 2009 దాడి తర్వాత కూడా శ్రీలంక జట్టు ఒకసారి పాకిస్తాన్ వెళ్లింది. 2017 అక్టోబర్‌లో శ్రీలంక లాహోర్‌లో ఒక టీ-20 మ్యాచ్ ఆడింది.
కానీ ఆ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్‌గా ఉన్న థిసార పెరీరా కూడా ఈసారి పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించాడు.
ఈ పర్యటనలో పాకిస్తాన్‌తో శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాల్సి ఉంది. కానీ వాటి తేదీలు, వేదికలు ఇంకా ఖరారు కాలేదు.
అయితే, శ్రీలంక క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో మాత్రం "పాకిస్తాన్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడకూడదు. ఒకవేళ ఆడాలనే అనుకుంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడాలి. అక్కడ పాకిస్తాన్ ఎన్నో టెస్ట్ సిరీస్‌లు ఆడింది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- కమలాతాల్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం
- ఎన్ఆర్సీ: ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)