You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
కళ్లను మాయ చేసే (optical illusion) ఒక ట్రిక్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
నార్వే విజువల్ ఆర్టిస్ట్ ఓవింద్ కోలాస్ ఇటీవల రంగుల్లో కనిపించే బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను సృష్టించారు.
ఒక ఫొటోపై రంగుల్లో గీతలు, ఆకృతులను సృష్టించి ఆయన ఈ ట్రిక్‌ను ప్రవేశపెట్టారు.
మన్కర్ ఇల్యూజన్
పై ఫొటో చూశారాగా.. జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఫొటోపైన రంగురంగుల చుక్కలు కనిపిస్తున్నాయి కదూ.
వాస్తవానికి మన మెదడు మనం చూసే రంగులను గ్రహించి రంగులు లేని ప్రాంతానికి కూడా దాన్ని ఆపాదిస్తుంది. దీనినే కలర్ అసిమిలేషన్ అంటారు.
చిత్రకారులతో ప్రసిద్ధిపొందిన పట్రియన్ అనే క్రౌండ్ ఫండింగ్ సంస్థ సోషల్ మీడియా పేజీలో ఈ ఫొటో ట్రిక్ గురించి కొలాస్ వివరించారు.
మన్కర్ ఇల్యూజన్‌గా కూడా పిలిచే ఈ అసిమిలేషన్ ఎలా పనిచేస్తుందో ఆయన తెలిపారు.
''బ్లాక్ అండ్ వైట్ ఫొటోపై రంగుల గ్రిడ్‌ను ఏర్పాటు చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలోని కణాలు రంగులను ఆపాదించుకున్నట్లు కనిపిస్తుంది'' అని ఆయన వివరించారు.
ఈ ఆర్టిస్ట్ వేర్వేరు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేర్వేరు ఆకృతులున్న పొరలను పరీక్షించారు. ఈ ఫొటోలు తీవ్రత పరంగా విభిన్న ప్రభావాలను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ కొంత కలర్ అసిమిలేషన్ కనిపిస్తుంది.
శాస్త్రీయ వివరణ
ఈ కలర్ అసిమిలేషన్ గురించి శాస్త్రవేత్తలకు బాగా తెలుసు.
''వర్ణపటం వల్ల దానిపైనున్న గ్రిడ్‌లు కొంత రంగును శోషిస్తాయి. అవి ఫొటోలోని మిగిలిన ప్రాంతాలకు ఆ రంగును ఆపాదిస్తాయి' అని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన విజన్ ఎక్స్‌పర్ట్ బర్ట్ అండర్‌సన్ 'సైన్స్ అలెర్ట్' వెబ్‌సైట్‌కు తెలిపారు.
మనం రంగులను కనిపెట్టాలని ప్రయత్నించినప్పుడు, మన మెదడు ఫొటోలోని ప్రతి భాగానికి సగటున కొంత రంగును ఆపాదిస్తుంది. దీంతో అది కలర్ ఫొటో అనే భ్రమ కలుగుతుంది.
వాస్తవానికి మనం ఒక ఫొటోను గమనించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోతే మన మెదడు ఆ ఫొటోకు సంబంధించిన దృశ్య సమాచారాన్ని కుదించి అందిస్తుంది.
ఇప్పుడు అదే ఫొటోను కాస్త ఎక్కువ సమయం గమనించండి. అప్పుడు మీరేం చూశారో తెలుసుకోవచ్చు.
ఫొటో బ్లాక్ అండ్ వైట్‌లో కనిపించిందా లేదా కలర్‌లోనా?
ఇవి కూడా చూడండి:
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- Zomato: 'తిండికి మతం లేదు'.. 'మరి హలాల్ మాటేంటీ?'
- 'హలో.. సన్నీ లియోని స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు'
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)