ఫ్రాన్స్‌లో బయటపడ్డ భారీ డైనోసార్ తొడ ఎముక.. పొడవు ఆరు అడుగుల పైమాటే..
ఫ్రాన్స్‌లో ఓ భారీ డైనోసార్ ఎముక బయటపడింది. ఆంగియక్ అనే ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా ఇది వెలుగుచూసింది.
ఇది శాకాహార సారోపాడ్ జాతి డైనోసార్ తొడ ఎముక కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఎముక 6.6 అడుగుల (2 మీటర్లు) పొడవు ఉంది.
సారోపాడ్‌లు పొడవైన మెడ, తోకతో ఉండేవి. భూమిపై జీవించిన అత్యంత భారీ జంతువుల్లో ఇవి కూడా ఒకటి.
ఇప్పటికీ ఆ ఎముక అంత సురక్షితంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పాలియాంథాలజిస్ట్‌లు అంటున్నారు.
ఇలాంటి ఎముకలు కలిగిన డైనోసార్లు 14 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవించాయని, వాటి బరువు 40 నుంచి 50 టన్నుల దాకా ఉండేవని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కని పిలవాలంటే రిమోట్ కావాలి
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- హిమ దాస్ గోల్డ్ మెడల్స్ విలువెంత.. మెరిసేదంతా బంగారమేనా
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- 'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్’ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్లకు తలనొప్పి కాకూడదు - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)