మయాంక్ అగర్వాల్: ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎలా సాధ్యమైంది?

భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కాలి వేలు విరగడంతో వరల్డ్ కప్ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు భారత జట్టులో చోటు లభించింది.

28 ఏళ్ల మయాంక్‌కు కనీసం ఒక్క అంతర్జాతీయ వన్డే ఆడిన అనుభవం కూడా లేదు. టెస్టుల్లో గతేడాదే అతడు అరంగేట్రం చేశాడు.

కానీ, దేశవాళీల్లో అతడికి మంచి రికార్డు ఉంది.

కర్ణాటక‌ జట్టుకు అతడు ఓపెనర్. లిస్ట్ ఏ (దేశవాళీ వన్డే) క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడిన మయాంక్ 48.71 సగటుతో 3605 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 2011లో అరంగేట్రం చేశాడు. 77 మ్యాచ్‌లు ఆడి 18.34 సగటుతో 1266 పరుగులు చేశాడు.

విజయ్ శంకర్ నెట్స్‌లో గాయపడటం వల్లే వరల్డ్ కప్‌కు దూరమవ్వాల్సి వచ్చింది.

ఇప్పటివరకూ టోర్నీలో అతడు మూడు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 58 పరుగులు చేసి, రెండు వికెట్లు తీశాడు. అత్యధికంగా ఓ మ్యాచ్‌లో 29 పరుగులు చేశాడు.

ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు.

భారత్ మంగళవారం జరిగే తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియాకు సెమీస్‌లో స్థానం ఖాయమవుతుంది.

ఇదివరకు టోర్నీకి భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ కూడా దూరమయ్యాడు. బొటన వేలు విరగడంతో అతడు జట్టును వీడాల్సి వచ్చింది.

కాగా, అంబటి రాయుడును కాకుండా మయాంక్ అగర్వాల్‌ను జట్టుకు ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో కొందరు ఇలా స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)