You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా.. ఎలాంటి నేరం చేయలేదు.. ఎలాంటి విచారణ లేదు
ఎలాంటి నేరానికి పాల్పడనప్పటికీ, ఏ రకమైన విచారణ లేకుండానే.... చైనాలో పది లక్షల మందికి పైగా ముస్లింలను డిటెన్షన్ కేంద్రాల్లో నిర్బంధించారు. పశ్చిమ ప్రాంతంలోని షిన్ జియాంగ్ లో ఉన్న ఇలాంటి కొన్ని కేంద్రాలను పరిశీలించేందుకు బీబీసీకి అరుదైన అనుమతి లభించింది. మొదట్లో చైనా తమ దేశంలో అసలు ఇలాంటి శిబిరాలే లేవంటూ తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం.. అవన్నీ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము నడుపుతున్న పాఠశాలలని చెబుతోంది.
పెద్ద పెద్ద సురక్షితమైన భవనాల్లో లక్షలాది మంది ముస్లింలను నిర్బంధిస్తున్నారనే ఆరోపణలను చైనా ఇంతకాలం తిరస్కరిస్తూ వచ్చింది.
కానీ, ఇప్పుడు మాకు వీటి లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఇందులో ఉన్నవారెవరూ బందీలు కాదనీ.. విద్యార్థులు మాత్రమేననీ... అలాగే ఈ తరహా బ్రెయిన్ వాషింగ్ కోసం వీరంతా స్వచ్ఛందంగానే ఇక్కడికి వచ్చారనే సందేశం ఇవ్వాలనుకుంటోంది చైనా.
మీరు మీ ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నారా? అని మేం అక్కడి వాళ్లను అడిగినప్పుడు.. ''అవును. నేను తీవ్రవాదంతో ప్రభావితమయ్యాను. నా ఆలోచనలను మార్చుకోవటం కోసం నేనిక్కడికి వచ్చాను'' అని మహేముటి చెప్పారు.
మేం చేసిన ప్రతి ఇంటర్వ్యూనూ ప్రభుత్వ అధికారులు గమనిస్తున్నారు.
షిన్ జియాంగ్ కు చెందిన ముస్లింలు, వీగర్లు, కజాఖ్‌లు, ఇంకా ఇతర మైనారిటీల ఆలోచనల్ని ఈ విధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
చైనీస్ భాషను, మతాచారాలపై ఆంక్షలకు సంబంధించిన అంశాలను వీరితో వల్లె వేయిస్తున్నారు. తమ విశ్వాసం, సంస్కృతి పట్ల ఉండే విధేయతను మరోదాని వైపు మళ్లించేలా చేస్తున్నారు.
వెళ్లిపోయేందుకు మీరు అనుమతించే వరకూ వీళ్లంతా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇది జైలులా అనిపించటం లేదా? ఇదొక జైలు అయినప్పుడు ఇక వీరిలో సృజనాత్మకత ఎలా ఉంటుంది? అని మేం అక్కడి అధికారులను ప్రశ్నించాం.
దానికి వారు ''మీరు దీన్ని జైలు అని ఎందుకంటున్నారో తెలియదు. ఇది నిజంగానే ఒక శిక్షణా కేంద్రం.'' అని తెలిపారు.
గత కొద్ది సంవత్సారాల్లో షిన్‌జియాంగ్ వ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం ఇలాంటి శిబిరాలను ఎన్నింటినో నిర్మించారు.
కానీ మమ్మల్ని తీసుకెళ్లిన చోట్లలో అంతర్గత భద్రత కోసం నిర్మించిన ముళ్లకంచెలను, వాచ్ టవర్స్ లాంటివి ఈ మధ్యనే తొలగించారు. వ్యాయామం చేయించే గ్రౌండ్లను ఆట స్థలాలుగా మార్చేశారు. దాంతో ఈ శిక్షణ శిబిరాలపై చాలా సందేహాలు కలుగుతున్నాయి.
తన ఫోన్లో కేవలం వాట్సాప్ ఉందన్న కారణంగా తనను నిర్బంధంలో ఉంచారని ప్రస్తుతం కజఖ్‌స్తాన్‌లో నివసిస్తున్న రఖీమా సెన్బే బీబీసీతో చెప్పారు.
ఈ క్యాంపుతో పాటు మరెన్నో శిబిరాల్లో ఆమెను ఏడాది పాటు నిర్బంధించారు. ఆమె అక్కడ హింసను, అమర్యాదకర ప్రవర్తనను ఎదుర్కొన్నారు. ఎవరైనా అధికారులు లేదా జర్నలిస్టులు క్యాంపుల్ని చూడడానికి వచ్చినప్పుడు తాము సంతోషంగా కనిపించేలా చేస్తారని ఆమె చెప్పారు.
''నేను స్వయంగా చూశాను. ఎవరైనా పర్యటనకు వస్తున్నారంటే మాకు ముందే చెప్పేవారు. వాళ్ల ముందు ఏదైనా సమస్య గురించి మాట్లాడితే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవారు. కాబట్టి అక్కడ ఏం మాట్లాడాలని చెబితే అదే మాట్లాడుతారు. డాన్స్ చేయమంటే చేస్తారు. పాటలు కూడా పాడుతారు.'' అని ఆమె తెలిపారు.
మరి ఇప్పుడు మా పర్యటన ఉందన్న విషయం కూడా వీళ్లకు ముందే చెప్పి ఉంటారా? వీళ్లు ఏ కేసులోనూ నేరస్థులు కారు. ఎలాంటి విచారణా జరగడం లేదు. కానీ మేం మాత్రం వీళ్లు చేయబోయే నేరాలేంటో ముందే కనిపెట్టగలమని చైనా అంటోంది.
మాకు చాలా మంది చెప్పారు. ఈ శిబిరాల్లో గతంలో ఉన్నవారిని మేం కలిశాం. ఇక్కడ తమను హింసలు పెడతారనీ, ఇవి కిక్కిరిసి ఉంటాయని, కుటుంబాలకు దూరం చేస్తారని వాళ్లు మాకు చెప్పారు.
ఇవి అంత ముఖ్యమైన విషయాలు కావు. ముఖ్యమైన విషయం ఏంటంటే... నేరం అంచుల వరకూ వెళ్లిన వ్యక్తులను కాపాడి తిరిగి వాళ్లను సాధారణ సమాజంలో భాగం చేయడం.
వీళ్లందరినీ భావి నేరస్థులుగా భావించి ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్లకు యూనిఫాంలు వేసి, ఒక్కో గదిలో పదేసి మంది చొప్పున ఉంచుతారు. ఒకే టాయిలెట్ ను అందరూ వాడుకోవాలి. ఇంకా ఇక్కడ ఎన్ని నెలలు లేదా ఏళ్లు ఉండాలో ఎవరికీ తెలియదు.
ఇప్పటికీ వాచ్ టవర్లు, ముళ్ల కంచెలతో ఉన్న ఇతర క్యాంపుల్ని మేం కెమెరాతో చిత్రీకరించే ప్రయత్నం చేశాం. ఈ భారీ భవన సముదాయాలు విద్యాలయాల్లా ఏ మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి పరిస్థితులు ఏ మాత్రం సంతోషాన్నిచ్చేవిగా లేవు.
రాత్రి పొద్దు పోయాక మేం మళ్లీ ఇక్కడికొచ్చాం. ఆలోచనలను మార్చే ప్రక్రియకు సంబంధించిన శబ్దాలు ఈ చీకట్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయడి
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ.. ఎందుకంటే..
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)