You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్
వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్‌కు ముందు ఫైనల్ లాంటిదని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే యాషెస్ పోరు కంటే ఈ మ్యాచ్‌నే జనాలు ఎక్కువగా చూస్తారని వ్యాఖ్యానించారు.
ముందు నుంచీ బ్యాటింగ్‌లో భారత్, బౌలింగ్‌లో పాకిస్తాన్ బలంగా ఉంటున్నాయని.. ఆదివారం మ్యాచ్‌లోనూ పాక్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్య పోటీ సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, పాక్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో బీబీసీ ప్రతినిధి వినాయక్ గైక్వాడ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైనా, భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారని, రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుందని అన్నారు.
అఫ్గానిస్తాన్ మినహా వరల్డ్ కప్‌లో అన్ని జట్లూ సమతూకంతో కనిపిస్తున్నాయని.. ఎవరు ఎవరినైనా ఓడించగలిగే పరిస్థితి ఉందని ఇంజమామ్ చెప్పారు.
పుల్వామా, బాలాకోట్ ఘటనల తర్వాత భారత్, పాక్ మ్యాచ్ ఉంటుందా అని పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ఓ క్రికెటర్‌గా ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. ''రెండు పక్షాలను నేను ఒకటే కోరుతున్నా. ఇది ఆట. మనం అలాగే చూడాలి. ఇంతకుముందు రెండు దేశాల మధ్య చాలా సార్లు క్రికెట్ పాజిటివ్ పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ కూడా అలాగే జరగాలి. గెలుపోటములు సహజం. బాగా ఆడినవారు గెలుస్తారు'' అని ఇంజమామ్ బదులు చెప్పారు.
భారత్, పాక్ మ్యాచ్‌ను ఆటలాగే చూడాలని, రెండు దేశాల మధ్య క్రికెట్ చాలా సార్లు పాజిటివ్ పాత్ర పోషించి, మంచి సందేశం పంచిందని ఆయన అన్నారు.
వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ భారత్‌పై పాక్ గెలవలేకపోయిందని, ఈసారి తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నానని ఇంజమామ్ చెప్పారు.
''ఆటలో గెలుపోటములు భాగం. దీన్నో పెద్ద విషయంలా చూడకూడదు. క్రికెట్ స్వచ్ఛంగా ఉండాలి. ఇది తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్ వల్ల రెండు జట్ల ఆటా మెరుగవుతుంది. క్రమం తప్పకుండా ఇలాంటి మ్యాచ్‌లు జరగాలి'' అని ఆయన అన్నారు.
భారత్, పాక్ మ్యాచ్ కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వర్షం వల్ల ఆటకు ఇబ్బంది కలగకూడదని ఆశిస్తున్నానని తెలిపారు.
''వర్షం ఎవరి చేతుల్లోనూ లేదు. ఐసీసీ, భారత్, పాకిస్తాన్.. ఎవరైనా ఏమీ చేయలేరు. వాతావరణం వల్ల ఈ మ్యాచ్‌కు ఇబ్బంది రాకూడదు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- #INDvPAK క్రికెట్లోనే ‘అతిపెద్ద పోటీ’కి వంద కోట్ల మంది ప్రేక్షకులు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఇంగ్లండ్‌లో ఎండాకాలంలో వానలు ఎందుకు కురుస్తున్నాయి...
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)