You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థాయ్‌లాండ్: ప్రఖ్యాత 'మాయా బే' బీచ్ 2021 వరకూ మూసివేత
ది బీచ్ సినిమాతో ప్రపంచ ఖ్యాతి పొందిన 'మాయా బే' బీచ్‌ను 2021 వరకూ మూసివేతను కొనసాగించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఫి ఫి లే దీవిలోని ఈ అందమైన తీరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరగటంతో అక్కడి పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే, గత ఏడాది ఈ బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
అప్పటికి ప్రతి రోజూ 5,000 మంది వరకూ పర్యాటకులు వస్తుండేవారు. జనం తాకిడితో బీచ్‌లోని కోరల్స్ (ప్రవాళ భిత్తికలు) చాలా వరకూ చనిపోయాయి.
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో నటించిన 2000 నాటి 'ది బీచ్' సినిమాతో మాయా బే బీచ్‌కు విపరీతమైన ప్రాచుర్యం లభించింది.
మాయా బే జీవవారణం పునరుద్ధరణ కోసం బీచ్ సందర్శన మీద పర్యాటకుల నిషేధాన్ని రెండేళ్లు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.
గత ఏడాది బీచ్‌ను మూసివేసిన తర్వాత బ్లాక్‌టిప్ రీఫ్ షార్క్‌లు బీచ్ జలాల్లో ఈదుతుండటం కనిపించింది.
ఈ బీచ్‌ను మళ్లీ తెరిచినపుడు సందర్శకుల సంఖ్యను పరిమితం చేస్తామని, తీర జలాల్లో బోట్లను నిషేధిస్తామని థాయ్‌లాండ్ జాతీయ పార్కుల విభాగానికి చెందిన థాన్ థామ్రాన్‌గ్నావాసావాత్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
అయితే.. తాము ఈ బీచ్ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నామని స్థానిక టూరిస్ట్ ఆపరేటర్లు అంటున్నారు.
స్థానికులు జీవనోపాధి పొందటానికి వీలుగా ఈ బీచ్ మూసివేతపై ప్రజా దర్బారు నిర్వహించాలని స్థానిక టూరిజం అసోసియేషన్ అధ్యక్షుడు వటానా రెర్న్‌గ్సామట్ కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత టాక్సీలా ఉపయోగించింది’: నరేంద్ర మోదీ
- భయంకరమైన పీడకలలకు రూపం ఇస్తే..
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
- ఐక్యూ తక్కువని వైద్యులు చెప్పారు... ఆ అమ్మాయే ఒలింపిక్స్ పతకాలు తెచ్చింది
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)