You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsAUS: వన్డే సిరీస్ ఆస్ట్రేలియా సొంతం, దిల్లీ వన్డేలో 35 పరుగుల తేడాతో విజయం
ఐదు వన్డేల సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైంది. చివరిదైన దిల్లీ వన్డేలో ఆసీస్ టీమిండియాను 35 పరుగుల తేడాతో ఓడించింది.
273 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 237 పరుగులకు ఆలౌటైంది.
స్టోయినిస్ వేసిన 50వ ఓవర్ చివరి బంతికి కులదీప్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు.
230 పరుగుల దగ్గర భారత్ 9వ వికెట్ కోల్పోయింది.
49వ ఓవర్లో మహమ్మద్ షమీ(3) అవుట్ అయ్యాడు. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అతడికే కాచ్ ఇచ్చాడు.
223 పరుగుల దగ్గర భారత్ వెంటవెంటనే భువనేశ్వర్(46), కేదార్ జాదవ్(44) వికెట్లను కోల్పోయింది.
46వ ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటవగా, తర్వాత రిచర్డ్‌సన్ ఓవర్లో సిక్సుకు ప్రయత్నించిన జాదవ్ మాక్స్‌వెల్‌కు కాచ్ ఇచ్చాడు.
43వ ఓవర్లో టీమిండియా 200 పరుగులు పూర్తి చేసింది.
40 ఓవర్లకు టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
రోహిత్ అవుటైన కాసేపటికే రవీంద్ర జడేజా కూడా పెవిలియన్ బాట పట్టాడు.
అదే ఓవర్లో ఐదో బంతికి పరుగులేమీ చేయకుండానే స్టంప్డ్ అయ్యాడు.
132 పరుగుల దగ్గర రోహిత్ శర్మ(56) అవుట్ అయ్యాడు.
జంపా వేసిన 29 ఓవర్ మూడో బంతిని ముందుకు వచ్చి ఆడడానికి ప్రయత్నించిన రోహిత్‌ను కీపర్ కేరీ స్టంప్డ్ చేశాడు.
120 పరుగుల దగ్గర భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
జంపా వేసిన 24 ఓవర్ నాలుగో బంతికి విజయ్ శంకర్ అవుట్ అయ్యాడు. ఖ్వాజాకు కాచ్ ఇచ్చాడు.
అంతకు ముందు రోహిత్ శర్మ వన్డేల్లో తన 41వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
21వ ఓవర్లో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 45, విజయ్ శంకర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
18వ ఓవర్ ఐదో బంతికి రిషబ్ పంత్(16) లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న టర్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
91 పరుగుల దగ్గర భారత్ మూడో వికెట్ కోల్పోయింది.
13 ఓవర్ మూడో బంతికి జట్టు స్కోరు 68 పరుగులు దగ్గర భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) అవుట్ అయ్యాడు.
స్టోయినిస్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన బంతిని కీపర్ కేరీ క్యాచ్ పట్టాడు
10 ఓవర్లకు భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది.
12 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధవన్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు.
273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
అంతకు ముందు....
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
చివరి బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించిన రిచర్డ్‌సన్ రనౌట్ అయ్యాడు.
48 ఓవర్ మూడో బంతికి ఆస్ట్రేలియా కమిన్స్ వికెట్ కోల్పోయింది.
జట్టు స్కోరు 263 పరుగుల దగ్గర కమిన్స్(15) భువనేశ్వర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.
45 ఓవర్ ఐదో బంతికి 229 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా 7వ వికెట్ కోల్పోయింది.
మహమ్మద్ షమీ బౌలింగ్‌లో కేరీ(3) వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.
44 ఓవర్ రెండో బంతికి 225 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.
స్టోయినిస్ (20) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
210 దగ్గర 42 ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా 5వ వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన టర్నర్ కులదీప్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా 40 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది.
37 ఓవర్ రెండో బంతికి హాండ్స్‌కోంబ్(52) అవుట్ అయ్యాడు. జట్టు స్కోర్ 182 పరుగుల దగ్గర మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.
34 ఓవర్ ఐదో బంతికి 178 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా మాక్స్‌వెల్ వికెట్ కోల్పోయింది.
ఒక్క పరుగే చేసిన మాక్స్‌వెల్ జడేజా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
33 ఓవర్ చివరి బంతికి ఖ్వాజా(100) అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఖ్వాజా 102 బంతుల్లో సెంచరీ చేశాడు. వీటిలో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
30 ఓవర్లకు ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది.
20 ఓవర్లకు ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఖ్వాజా హాఫ్ సెంచరీ చేశాడు.
15వ ఓవర్లో 76 పరుగుల దగ్గర ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది.
ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్(27) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
భారత జట్టులో చాహల్, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. జడేజా, షమీలకు చోటు కల్పించారు.
ఆస్ట్రేలియా జట్టులో షాన్ మార్ష్, జాసన్ బెహ్రెన్‌డోర్ఫ్‌లకు విశ్రాంతినిచ్చి, మార్కస్ స్టొయనిస్, నాథన్ లయన్‌లను తీసుకున్నారు.
ఈ సిరీస్‌లో హైదరాబాద్, నాగపూర్‌ల్లో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లను భారత్ గెల్చుకోగా, తర్వాత రాంచీ, మొహాలీల్లో జరిగిన రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెల్చుకుంది.
ఇవి కూడా చదవండి:
- మైకేల్ జాక్సన్ లెగసీ మసకబారిందా? అతడి సంగీతం మూగబోతుందా? పాప్ రారాజును భవిష్యత్ తరాలు మరచిపోతాయా?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
- మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే భారత్ డిమాండ్‌ను చైనా ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు?
- విరాట్ కోహ్లీకి ధోనీ ఎంత అవసరం?
- విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
- విరాట్ కోహ్లీ: 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)