You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లెవ్ లాండా: గూగుల్ డూడుల్లో ఉన్న ఈ వ్యక్తి ఎవరు?
ఈ రోజు గూగుల్ డూడుల్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన పేరు లెవ్ డావిడోవిక్ లాండా. ఈయన అజర్‌బైజాన్ దేశానికి చెందిన భౌతిక శాస్ర్తవేత్త. ఈయన 1908 జనవరి 22న బాకులో జన్మించారు.
20వ శతాబ్దంలో భౌతికశాస్ర్తంలో పలు కీలక ఆవిష్కరణలు చేశారు.
ఈయన బాల మేధావి కూడా. చిన్నప్పటి నుంచి గణితం, సైన్స్‌లో చాలా ప్రతిభ చూపించేవారు. తల్లి వైద్యురాలు. తండ్రి చమురు కంపెనీలో ఇంజనీరు.
లాండా 13 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేసుకుని కళాశాలకు వెళ్లారు. 1924లో లెనింగ్రాడ్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్ర్త కోర్సులో చేరారు.
18 ఏళ్ల వయసులోనే స్పెక్ట్రా డయాటోమిక్ మాలిక్యూల్స్ సిద్ధాంతంపై మొదటి పత్రాన్ని సమర్పించారు. 21 ఏళ్లకే పీహెచ్‌డీ పూర్తి చేసి పలు ఆవిష్కరణలు చేశారు.
క్వాంటమ్ మెకానిక్స్‌లో డెన్సిటీ మ్యాట్సిక్ విధానాన్ని ఆవిష్కరించిన వారిలో లాండా ఒకరు.
అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో ద్రవరూప హీలియం స్వభావాలపై అధ్యయనం చేసినందుకు 1962లో నోబెల్ బహుమతి లభించింది.
లాండా పేరిట పలు విధానాలు
భౌతిక శాస్ర్తంలో పలు కాన్సెప్ట్‌లకు లాండాకు అన్వయించారు. లాండా డిస్ట్రిబ్యూషన్, లాండా గాజ్, లాండా పోల్ తదితరాలు ఆ కోవలోకి వస్తాయి.
కేవలం నోబెల్ బహుమతే కాకుండా ఈయన ఈఎం లిప్షిజ్‌తో కలిసి లెనిన్ సైన్స్ ప్రైజ్ కూడా అందుకున్నారు.
సైద్ధాంతిక భౌతిక శాస్ర్తంలో చేసిన అధ్యయానికి ఈ బహుమతి లభించింది.
ఆయన పేరిట మాస్కోలో లాండా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియోరెటికల్ ఫిజిక్స్ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- వర్జినిటీని మూత తీయని సీసాతో పోల్చుతారా ? : అభిప్రాయం
- అరకు బెలూన్ ఫెస్ట్: ఒక్కో బెలూన్ ఖరీదు రూ.1.5 కోట్లు
- ట్విటర్ సంచలనం: ఒక్క ట్రిక్కుతో 50 లక్షల రీట్వీట్లు
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- పదేళ్ల నుంచి కోమాలో ఉన్న మహిళ ప్రసవం... ఆస్పత్రి సిబ్బందికి డీఎన్ఏ పరీక్షలు
- హరప్పా నాగరికతలో పురాతన ‘దంపతుల’ సమాధి చెప్తున్న చరిత్ర
- విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు వాస్తవానికి భారతీయ సైనికులవి కాదు
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)