You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలో మంచు పండుగ... మైనస్ 35 డిగ్రీల చలిలో సరికొత్త నగర నిర్మాణం
మంచు కురిసే వేళ ఈశాన్య చైనా కొత్త అందాలను సంతరించుకుంటుంది. హర్బిన్ మంచు ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మంచుతో కప్పేసి ఉన్న కోటలను, ఐస్‌తో చేసిన శిల్పాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
1980లో తొలిసారి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచు కళాఖండాలు ఇందులో ప్రదర్శిస్తున్నట్లు చెబుతుంటారు.
ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఏర్పాటు చేసిన లైట్ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఏటా వివిధ దేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
దాదాపు 1,20,000 ఘనపు మీటర్ల మంచు, స్నో ఫాల్‌తో ఈ ఐస్ వరల్డ్‌ను నిర్మించారు.
ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 35 సెంటీగ్రేడ్‌కు పడిపోవడంతో ఆర్టిస్టులు తమ సృజనకు పదును పెట్టి ఇలా మంచు నగరాన్ని నిర్మించారు.
ఇక్కడి సొన్గుహ సరస్సు పూర్తిగా మంచుతో గడ్డకట్టడంతో అక్కడున్న మంచుతో 2019 స్నోమెన్‌లను సృష్టించారు
వణికించే ఈ మంచులో ఈత పోటీలు కూడా జరుగుతాయి. దాదాపు 300 మంది ఈ పోటీలో పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి:
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- చైనా యూత్ ఒకరికి మించి ఎందుకు కనడం లేదు? ఇద్దరిని కనేందుకు ఎందుకు భయపడుతున్నారు?
- చంద్రుని ‘అంధకార ప్రాంతం’పై దిగిన చైనా అంతరిక్ష వాహనం
- ఈ ఆరు సూత్రాలనూ పాటిస్తే.. హాయిగా నిద్రపోవచ్చు
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- సైకోలే సరైన నాయకులా?
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదా, కాదా
- మనం పుట్టడమే మంచివాళ్లుగా పుడతామా? చెడ్డవాళ్లుగా పుడతామా?
- పపువా న్యూ గినీ: చైనా అమ్ముల పొదిలో కొత్త అస్త్రం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)