ఊబకాయం కేన్సర్‌కు దారితీయొచ్చు... జాగ్రత్త

మన శరీరంలోని కొన్ని కణాలు కేన్సర్‌ను అరికడతాయి. కానీ కొవ్వు కారణంగా అవి పనిచేయడం ఆపేస్తాయి. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ పరిశోధన బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.

బ్రిటన్‌వాసుల్లో నివారించదగ్గ కేన్సర్‌ కారకాల్లో మొదటిది పొగతాగడమైతే, ఊబకాయం దాని తర్వాత స్థానంలో నిలుస్తోంది.

ఊబకాయం శరీరంలోని కొన్ని అవసరమైన కణాల్ని నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కారక కణజాలం పెరగడానికి కూడా అది దోహదం చేస్తుంది.

దీనికి పరిష్కారం కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

అప్పటివరకూ, ఊబకాయం రాకుండా జాగ్రత్తగా ఉండటం మేలు.

ఊబకాయం మనుషుల్లో 13 రకాల కేన్సర్లకు కారకం కావచ్చని యూకే కేన్సర్ రిసెర్చ్ సంస్థ అంచనా.

ఈ ముప్పు తప్పించుకోవాలంటే.. ఊబకాయాన్ని తప్పించుకోవాల్సిందే.

మంచి ఆహారం తీసుకుంటూ, ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)