You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆలెన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆలెన్ తన 65వ ఏట క్యాన్సర్‌తో మరణించారు.
2009లో నయమైనట్లు కనిపించిన వ్యాధి మళ్లీ తిరగబెట్టిందని, అయినా తాను కోలుకుంటానని ఆశిస్తున్నట్లు రెండు వారాల క్రితమే పాల్ ఆలెన్ ప్రకటించారు. కానీ ఇంతలోనే నాన్-హాడ్జ్‌కిన్స్ లింఫోమా క్యాన్సర్‌తో ఆయన మరణించారు.
''నా చిరకాల మిత్రుడు, అత్యంత సన్నిహితుడు అయిన పాల్ ఆలెన్ మరణం నన్ను కుదిపివేసింది. అతనే లేకుంటే 'పర్సనల్ కంప్యూటింగ్' అన్నదే ఉండేది కాదు'' అని బిల్ గేట్స్ అన్నారు.
ఆల్లెన్ మరణ వార్తను ధృవీకరిస్తూ.. ''పాల్ ఆలెన్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. అతని మంచితనాన్ని, ప్రేమను చవిచూసిన కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ అదృష్టవంతులు..'' అని ఆయన సోదరి తెలిపారు.
తన బాల్యమిత్రుడు బిల్‌గేట్స్‌తో కలిసి సాంకేతిక దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ను 1975లో ప్రారంభించారు.
''నా బాల్యంలో, మైక్రోసాఫ్ట్ స్థాపించడంలో, ఆ తర్వాత మేం చేసిన ప్రజోపకార కార్యక్రమాల్లో ఆలెన్ నాకు తోడుగా నిలబడ్డాడు. అతడు నాకు నిజమైన భాగస్వామి, నిజమైన స్నేహితుడు. ఆయన లేకపోయినా, సాంకేతిక రంగంలో ఆయన ఆవిష్కరణలను, ఆయన దాతృత్వాన్ని భవిష్యత్ తరాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి..'' అని బిల్ గేట్స్ అన్నారు.
ఇంతవరకూ పాల్ ఆలెన్ దాదాపు 200కోట్ల డాలర్లను సైన్స్, విద్య, వన్యప్రాణి సంరక్షణ లాంటి కార్యక్రమాలకు విరాళం ఇచ్చినట్లు 'అసోసియేట్ ప్రెస్' తెలిపింది.
తన మరణానంతరం, తన సంపదలో అధిక భాగం సేవా కార్యక్రమాలకు చెందాలని 2010లో ఆయన నిర్ణయం తీసుకున్నారు.
బీబీసీ ఉత్తర అమెరికా టెక్నాలజీ రంగ విలేకరి డేవ్ లీ విశ్లేషణ:
టెక్నాలజీ మేగజీన్ 'వైర్డ్' తన 25వ వార్షికోత్సవంలో నేను పాల్గొన్నాను. వార్షికోత్సవం ఆ సంచికకు మాత్రమే కాదు.. సాంకేతిక రంగానికే అది వార్షికోత్సవం అని చెప్పొచ్చు.
వైర్డ్ సంచికలో పాల్ ఆలెన్ పేరు ఎన్నోసార్లు ప్రస్తావనకు వచ్చింది.
పాల్ ఆలెన్ గతంలోనే క్యాన్సర్‌తో పోరాడి నిలబడ్డారు. ఆయన చాలా ధైర్యంగా కనిపించేవారు. చివరివరకూ ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తూ చురుకుగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పారు.
బిల్ గేట్స్, పాల్ ఆలెన్ స్నేహం వారి వ్యక్తిగత జీవితాలకు మాత్రమే పరిమితం కాలేదు. టెక్నాలజీ రంగం, సేవా కార్యక్రమాల్లో కూడా వీరి స్నేహం కొనసాగింది.
ఇవి కూడా చదవండి
- మొఘలుల పాలనలో నవరాత్రి వేడుకలు ఎలా జరిగేవి?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- మీ కంప్యూటర్ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుసా?
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యారిలా
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
- వర్ణాంతర వివాహం: ఆఫ్రికా అబ్బాయి, ఇండియా అమ్మాయి.. ఓ అందమైన ప్రేమ కథ
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)