ఇండోనేసియా సునామీ: ‘‘అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్లింది? అని పాప అడుగుతోంది’’

వీడియో క్యాప్షన్, ఇండోనేసియా సునామీ: ‘‘అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడికి వెళ్లింది? అని పాప అడుగుతోంది’’

ఇండోనేసియాలో శిథిలాల్లో చిక్కుబడిపోయిన వారిని వెదికేందుకు సాగిస్తున్న సహాయ చర్యలను అక్టోబర్ 5వ తేదీ శుక్రవారంతో నిలిపివేయనున్నారు. ఆ దేశంలో గతవారం వచ్చిన భూకంపం, సునామీలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిందే. పాలూ, దాని పరిసర ప్రాంతాల్లో శిథిలాలకింద చిక్కుకున్న వారిలో దాదాపు ఇక ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ విపత్తు మూలంగా 14 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఓ అంచనా.

ఇండోనేసియాలో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ షాక్ లోంచి కోలుకోలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)