#BBCArchives: ఆ ద్వీపం జనాభా 50... ఆ బడిలో పిల్లల సంఖ్య 6
పట్టణాలతో పోల్చితే పల్లెల్లో జీవించడం ఒక ప్రత్యేకమైన అనుభవమని అనుకుంటే, ఒక చిన్నదీవిలో పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం మరెంతో ప్రత్యేకం.
బ్రిటిష్ ద్వీపం సిలీలో ఆ అనుభవం ఎలాంటిదో తెలుసుకోవాలంటే.. టైమ్ మెషీన్‌లో 1976 సంవత్సరానికి వెళ్ళాల్సిందే.
వీరంతా ఒక చిన్న ద్వీపంలో ఉంటున్నారు. బ్రిటన్‌కు నైరుతి దిశగా అట్లాంటిక్ సముద్రంలో 50 కిలోమీటర్ల దూరంలో ఉందీ దీవి.
సెయింట్ ఏగ్నస్ వైశాల్యం రెండున్నర చదరపు కిలోమీటర్లు కూడా ఉండదు. 70ల చివర్లో అక్కడి జనాభా ఎంతో తెలుసా? యాభై కన్నా కాస్త ఎక్కువ.
అయిదు నుంచి తొమ్మిదేళ్ళ వయసున్న పిల్లలు అక్కడి తరగతిగదిలో ఆరుగురే ఉన్నారు. తమతో తాము ముచ్చటించడం, కాసేపు అక్కడి ఏకైక టీచర్ మారిగోల్డ్ బుష్ చెప్పే పాఠాలు వినడం... అదే ఆ పిల్లల దినచర్య.
"ఇక్కడ పాఠాలు బోధించడం చాలా సరదాగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పుష్కళంగా ఉన్న ఈ విద్యార్థులకు పాఠాలు చెబుతూ మనం తెలుసుకునే విషయాలూ చాలానే ఉంటాయి. వాళ్ళకు బడికి రావడమంటే ఎంతో ఇష్టం" అంటారు ఆ టీచర్.
ఈ చిన్న మారిగోల్డ్ స్కూల్ చుట్టూ ఎక్కడ చూసినా అద్భుత ద్వీప సౌందర్యం కనువిందు చేస్తుంది.
నగరాల్లోని విద్యార్థులు ఎప్పుడో ఏడాదికోసారి విహార యాత్రల పేరుతో అనుభవించే ఆనందాన్ని, ఇక్కడి పిల్లలు ప్రతిరోజూ అనుభవిస్తారన్న మాట. ఈ పిల్లల స్కూల్ బస్సుకు ట్రాఫిక్‌ను ఛేదించుకుని వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)