ఐస్‌లాండ్: పోటెత్తుతున్న పర్యాటకులు.. ప్రమాదంలో పర్యావరణం
పదేళ్ల క్రితం వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పర్యాటకాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంది ఐస్‌లాండ్. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు తోడు అతి తక్కువ ఖర్చుతోనే వెళ్లొచ్చే అవకాశం ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఐస్‌లాండ్‌కి క్యూ కట్టారు. కానీ వెల్లువెత్తిన ఆ టూరిస్టులే ఇప్పుడు ఈ దేశానికి ఇబ్బందిగా మారారు. పచ్చని పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు.
ఐస్‌లాండ్ దేశస్థులు తమ దేశాన్ని నిప్పుల కొలిమి అని, మంచు నేల అని పిలుస్తారు. పర్వతాలు, గ్లేసియర్లు, ఆవిరి కుండాలు.. ఇలా అన్నీ ఐస్‌లాండ్‌లో కనిపిస్తాయి. ఫలితంగా ఇప్పుడు మిగిలిన ప్రపంచం ఇప్పుడిప్పుడే ఐస్‌లాండ్ గురించి తెలుసుకుంటోంది.
అట్లాంటిక్ మహా సముద్రాన్ని ఆనుకొని యూరోప్- అమెరికాల మధ్య ఉన్న ఐస్‌లాండ్‌లో ఆగడం చాలా మంది కల. అదే ఇప్పుడు ఈ తరహా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే వాళ్లు ఇక్కడ కొద్ది సేపు సేద తీరి సెల్ఫీ టూరిస్ట్‌గా మారాలనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా ఎన్నికైన ప్రధాని కూడా ఒక్కసారిగా పెరుగుతున్న పర్యాటకుల ఫలితంగా పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పుపై దృష్టి పెట్టారు.
‘‘పర్యాటకులు ఒక్కసారిగా పెరిగిపోయారు. మేం వాళ్లను అదుపు చెయ్యలేకపోతున్నాం కూడా. అలాగే ఇక్కడున్న ప్రకృతి అందాలను చూసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. అంటే రవాణా సౌకర్యాల్లాంటివి. అందుకే మా ప్రభుత్వం కనీస సౌకర్యాల్ని కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది’’ అని ఐస్‌లాండ్ ప్రధానమంత్రి కాథరిన్ యాకబ్ స్దతిర్ బీబీసీకి చెప్పారు.
ఇక విమర్శల్ని పక్కన పెడితే 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ఐస్‌లాండ్ మళ్లీ కోలుకోవడంలో పర్యాటక రంగమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. సుమారు 40 శాతం ఉపాధి పర్యాటకం వల్లే లభిస్తోంది. కానీ పర్యాటకులు ఫోటోలపై దృష్టి పెడుతున్నట్లే.. ఐస్‌లాండ్ వాసులు కచ్చితంగా పర్యాటకానికి, ప్రకృతికి మధ్య సమన్వయం సాధించడంపై దృష్టి పెట్టాలి. పర్యాటకాన్ని పెంచుకుంటూనే ఈ అందమైన ప్రకృతిని అలాగే భావి తరాలకు అందించాలి.
ఇవి కూడా చూడండి:
- తిరుమల కొండల్లో దాగిన తుంబుర తీర్థం!
- కోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!
- సల్మాన్ ఖాన్‌ను జైలుకు పంపించిన బిష్నోయిలు ఎవరు?
- చైనా: వసంతం వచ్చింది.. అందాలు తెచ్చింది
- అద్దాల రైలులో ఆంధ్రా ఊటీకి వెళ్లొద్దామా!
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
- వందేళ్ల ఫిన్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)